Ranabaali Shoot Wrapped | టాలీవుడ్ పాన్-ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ (Ranabaali) షూటింగ్ తాజాగా పూర్తిచేసుకుంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ భారీ చారిత్రాత్మక చిత్రానికి రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ఇక సినిమా థియేట్రికల్ విడుదలకు సరిగ్గా 29 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో, మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను మరింత వేగవంతం చేశారు. రణబాలి మరియు జయమ్మ మిమ్మల్ని థియేటర్లలో కలవడానికి సరిగ్గా 29 రోజుల్లో సిద్ధమవుతున్నారు అంటూ చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా ఒక ప్రత్యేకమైన పోస్ట్‌ను షేర్ చేసింది. ప్రేక్షకులకు ఒక అద్భుతమైన విజువల్ వండర్, అసాధారణ సినిమా అనుభూతిని పంచేందుకు కౌంట్‌డౌన్ అధికారికంగా మొదలైందని, రాబోయే అక్టోబర్ 16న దసరా పండుగ కానుకగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అత్యంత వైభవంగా ప్రేక్షకుల ముందుకు రానుందని యూనిట్ వెల్లడించింది. మరోవైపు, ఇటీవల విడుదలైన ‘రణబాలి’ టీజర్ యూట్యూబ్‌లో నంబర్ 1 స్థానంలో ట్రెండింగ్‌లో నిలవడమే కాకుండా, సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది.
Ranabaali & Jayamma will meet you in 29 DAYS ❤️
Shoot wrapped up!
Countdown to witness spectacular cinema begins ❤🔥#Ranabaali GRAND RELEASE WORLDWIDE ON 16.10.26.#RanabaaliTeaser TRENDING #1 on YouTube 🔥
▶️https://t.co/US5EO1LZGK#NeverForget#RanabaaliOnOct16th pic.twitter.com/9W7z2ILHub— Vamsi Kaka (@vamsikaka) September 17, 2026