చండీఘడ్: పంజాబీ సింగర్ సిద్దూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితుడైన గోల్డ్ బ్రార్(Goldy Brar)ను అమెరికా పోలీసులు హతమార్చినట్లు ఇవాళ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఆ వార్తలను ఖండిస్తూ అమెరికా పోలీసులు ప్రకటన జారీ చేశారు. కాలిఫోర్నియాలోని ఫ్రెస్నోలో గోల్డీ బ్రార్ హత్య జరిగినట్లు తొలుత వార్తలు వ్యాపించాయి. గోల్డీ బ్రార్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు సెంట్రల్ ఫోరోజోనాలో జరిగిన కాల్పుల్లో హతమైనట్లు ఓ అమెరికా వెబ్సైట్ తన కథనంలో పేర్కొన్నది. అయితే వైరల్ వార్తలు వ్యాపిస్తున్న నేపథ్యంలో ఫ్రెస్నో పోలీసులు ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ఆ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయింది 37 ఏళ్ల గ్జావియర్ గ్లాడ్నే అని పోలీసులు తెలిపారు.