Kia EV6 facelift | పెద్ద బ్యాటరీతో కియా ఈవీ6 ఫేస్‌లిఫ్ట్.. త్వరలో గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరణ..?!
Kia EV6 facelift | దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా ఇండియా తన ’ఈవీ6 ఫేస్‌లిఫ్ట్ (EV6 facelift)’ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కారును త్వరలో అప్ డేట్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది.
Kia EV6 facelift | దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా ఇండియా తన ’ఈవీ6 ఫేస్‌లిఫ్ట్ (EV6 facelift)’ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కారును త్వరలో అప్ డేట్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. 2025 ఈవీ6 ఎస్యూవీ ఎలక్ట్రిక్ కారును గ్లోబల్ మార్కెట్లలో కొన్ని వారాల్లో ఆవిష్కరించనున్నది. ఈవీ6 ఎస్‌యూవీలో డ్రైవింగ్ రేంజ్ పెంచడానికి భారీ బ్యాటరీ ప్యాక్‌తోపాటు పలు ఫీచర్లు జత చేసినట్లు తెలుస్తున్నది.
ఫ్రంట్, రేర్పై కంపెనీ కారు మోడల్ పాక్షిక వివరాలు ఉంటాయని తెలుస్తున్నది. హెడ్ లైట్, టెయిల్ లైట్ కొత్తగా అప్ డేట్ చేశారు. కొత్తగా ‘స్టార్ మ్యాప్ సిగ్నేచర్ లైటింగ్’తోపాటు హెడ్ లైట్ యూనిట్ చుట్టూ రాప్ అరౌండ్ ఎలిమెంట్‌తోపాటు ఎల్ఈడీ డే టైం రన్నింగ్ లైట్స్ ఉంటాయి. ప్రస్తుత ఈవీ6 కారులో కంటే తక్కువ కెపాసిటీ గల ఎల్ఈడీ హెడ్ లైట్ ఉంటుంది. బంపర్, గ్రిల్లె డిజైన్లోనూ మార్పులు ఉంటాయని తెలుస్తున్నది. రీఫ్రెష్డ్ డిజైన్‌తోపాటు కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్, ఈచ్ ఎండ్ యారో సిగ్నేచర్, ఫ్రెష్ డిజైన్‌తో రేర్‌లో బంపర్, రీ డిజైన్డ్ అల్లాయ్ వీల్స్ వస్తున్నాయి. రీడిజైన్డ్ స్టీరింగ్ వీల్, న్యూ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, మరిన్ని సేఫ్టీ, కంఫర్ట్ ఫీచర్లు ఉంటాయి.
ఇంకా కియా ఈవీ6 ఫేస్‌లిఫ్ట్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కారులో ఇంతకుముందు హ్యుండాయ్ ఐయానిక్ 5లో వినియోగించిన 84కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ వాడతారని తెలుస్తుంది. సింగిల్ చార్జింగ్‌తో 700కి.మీ పై చిలుకు దూరం ప్రయాణించే కెపాసిటీ గల జీటీ లైన్, జీటీ లైన్ ఏడబ్ల్యూడీ వేరియంట్లను భారత్ మార్కెట్లో విక్రయిస్తుంది.కియా ఈవీ6 ఎలక్ట్రిక్ ఎస్ యూవీ కారు ధర రూ.60.95 లక్షలతో ప్రారంభమై, టాప్ హై ఎండ్ వర్షన్ కారు ధర రూ.65.95 లక్షలు పలుకుతుంది. కియా ఇండియా నుంచి వస్తున్న తొలి డెడికేటెడ్ ఈవీ మోడల్ ‘ఈవీ6 ఎలక్ట్రిక్ ఎస్యూవీ’ మొదటిది. ఈ-జీఎంపీ ప్లాట్ ఫామ్ బేస్డ్గా ఈ కారు రూపుదిద్దుకున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

