NTR 31 | కేజీఎఫ్ సినిమాలతో కన్నడ సినీ ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకొని సలార్ (Salaar)తో ఇండియన్ సినీ పరిశ్రమను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాడు దర్శకుడు ప్రశాంత్ నీల్ (PrashanthNeel). ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించాయి. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో సలార్ 2 తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమా అనంతరం ప్రశాంత్ నీల్ టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌తో ఎన్టీఆర్ 31 (NTR 31) సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ పోస్టర్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ క్రేజీ కాంబో షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా..ఎప్పుడెప్పుడు సినిమా నుంచి అప్డేట్లు వస్తాయా అని తారక్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ సంబంధించి సాలిడ్ రూమర్ వైరల్ అవుతుంది.
ఈ ప్రాజెక్ట్‌ను 2024 సెప్టెంబర్ నుంచి ప్రశాంత్ సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తుంది. ప్రశాంత్ ప్రస్తుతం సలార్ 2 షూటింగ్లో బిజీగా ఉండగా.. ఈ చిత్ర షూటింగ్ అనంతరం దీనిని సెట్స్ కి మీదకి తీసుకురానున్నాడు. ఈ సినిమాను కూడా ప్రశాంత్ నీల్ రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఒకవేళ ఇదే నిజమైతే తారక్ ఫ్యాన్స్‌కు పండగే అని చేప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ రెండు పార్టులుగా తీయగా.. అవి ఆల్ టైం బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. మరోవైపు సలార్ కూడా రెండు పార్టులుగా వస్తుంది. ఫస్ట్ పార్ట్ ఇప్పటికే సూపర్ హిట్ అవ్వగా రెండో పార్ట్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే ఎన్టీఆర్ 31 కూడా రెండు పార్టులుగా రానుండటంతో మూవీపై భారీ అంచనాలు ఉండనున్నట్లు తెలుస్తుంది.