Auto Sales | న్యూఢిల్లీ, మే 1: వాహన అమ్మకాలు టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నాయి. నూతన ఆర్థిక సంవత్సరం తొలి నెలలోనే వాహన అమ్మకాలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా ప్యాసింజర్ వాహనాలకు డిమాండ్ అంతంత మాత్రంగానే ఉండటంతోపాటు సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటంతో స్వల్పంగా ప్రభావం చూపాయి. మొత్తంగా గత నెలలో 3,38,341 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే నెలలో అమ్ముడైన 3,32,468లతో పోలిస్తే 1.77 శాతం పెరిగాయి. కార్ల తయారీలో అగ్రగామి సంస్థలైన మారుతి సుజుకీ, హ్యుందాయ్‌లు సింగిల్ డిజిట్ వృద్ధిని నమోదు చేసుకోగా, టాటా మోటర్స్, టయోటా కిర్లోస్కర్ రెండంకెల వృద్ధిని సాధించాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్లీ పుంజుకునే అవకాశాలున్నాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.