‘దేవర 2’కు ముహూర్తం ఖరారైందా?
పానిండియా బ్లాక్‌బస్టర్ ‘ఆర్ఆర్ఆర్' తర్వాత తారక్ నుంచి వచ్చిన సినిమా ‘దేవర’. రాజమౌళి సినిమా చేసిన హీరోకు వెంటనే హిట్ రావడం అసంభవం అనుకునే రోజుల్లో, ఆ సెంటిమెంట్‌ని బ్రేక్ చేసి, 500కోట్ల వసూళ్లు సాధించి, సోలో హీరోగా తారక్ కెరీర్లోనే వసూళ్ల పరంగా బెస్ట్‌గా నిలిచింది ‘దేవర’.
పానిండియా బ్లాక్‌బస్టర్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తారక్ నుంచి వచ్చిన సినిమా ‘దేవర’. రాజమౌళి సినిమా చేసిన హీరోకు వెంటనే హిట్ రావడం అసంభవం అనుకునే రోజుల్లో, ఆ సెంటిమెంట్‌ని బ్రేక్ చేసి, 500కోట్ల వసూళ్లు సాధించి, సోలో హీరోగా తారక్ కెరీర్లోనే వసూళ్ల పరంగా బెస్ట్‌గా నిలిచింది ‘దేవర’. ఈ సినిమా సీక్వెల్ కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్‌కు ఉన్న కమిట్మెంట్ల వల్ల ఈ సినిమా ఆలస్యం అవుతూవచ్చింది. అయితే.. ఎట్టకేలకు ఈ సినిమాపై నిర్మాత సుధాకర్ మిక్కిలినేని క్లారిటీ ఇచ్చారు. ‘దేవర 2’ రెగ్యులర్ షూటింగ్ మే నుంచి మొదలుకానున్నదని ఆయన తెలిపారు. ప్రస్తుతం తారక్ ‘డ్రాగన్'(వర్కింగ్ టైటిల్) సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. దర్శకుడు ప్రశాంత్‌నీల్ తన గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాను కూడా రెండు భాగాలుగా తీస్తున్నాడని వినికిడి. త్వరితగతిన ఈ సినిమా షూటింగ్‌ని పూర్తి చేసి, మే నుంచి ‘దేవర 2’ సెట్లోకి తారక్ ఎంట్రీ ఇస్తారట. కథలో భారీగా మార్పులు జరిగాయని, షూటింగ్ షెడ్యూల్ కూడా ఫైనల్ అయ్యిందని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని చిత్రబృందం చెబుతున్నది. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ విలన్‌గా కనిపించనున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

