Aditi Rao Hydari | సిద్దార్థ్‌తో ఎంగేజ్మెంట్.. తొలిసారి స్పందించిన అదితి రావ్ హైదరీ
Aditi Rao Hydari | కోలీవుడ్ నటుడు సిద్దార్థ్, హైదరాబాదీ బ్యూటీ అదితి రావ్ హైదరీలు గత నెల ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. వనపర్తి జిల్లాలోని శ్రీరంగపురం ఆలయంలో ఈ వేడుక జరుగగా.. ఇరు కుటుంబాలు సహా అత్యంత సన్నిహితులు ఈ నిశ్చితార్థంకు హాజరయ్యారు.
Aditi Rao Hydari | కోలీవుడ్ నటుడు సిద్దార్థ్, హైదరాబాదీ బ్యూటీ అదితి రావ్ హైదరీలు గత నెల ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. వనపర్తి జిల్లాలోని శ్రీరంగపురం ఆలయంలో ఈ వేడుక జరుగగా.. ఇరు కుటుంబాలు సహా అత్యంత సన్నిహితులు ఈ నిశ్చితార్థంకు హాజరయ్యారు. అయితే వనపర్తి సంస్థానాధీశుల వారసుల్లో నటి అదితి రావు హైదరి కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. దీంతో పురోహితులు దగ్గరుండి ఈ వేడుక జరిపించారు. అయితే నిశ్చితార్థంపై ఇప్పటివరకు అదితి రావు హైదరీ ఎటువంటి ప్రకటన చేయకపోవడం విశేషం. ఇదిలావుంటే తాజాగా ఈ నిశ్చితార్థంపై అదితి రావ్ ఓ ఇంటర్వ్యూలో స్పందించింది.
తన తల్లి కోరిక మేరకు నాకు నిశ్చితార్థం అయినట్లు బహిరంగంగా ప్రకటించినట్లు అదితి వెల్లడించారు. నా ఎంగేజ్మెంట్ అయిన రోజు చాలా మంది మా అమ్మకు కాల్ చేసి నిజంగానే అదితి పెళ్లి చేసుకోబోతుందా అని మా పెళ్లి గురించి తెలుసుకోవాలని అనుకున్నారు. ఇక అమ్మ కూడా వారి బాధ చూడలేక.. దయచేసి ప్రజలకు చెప్పండి, నాకు నాన్‌స్టాప్ కాల్స్ వస్తున్నాయి అంటూ తెలిపింది. దీంతో నేను నేను, సిద్ధార్థ్ దీనిపై పోస్ట్‌లు పెట్టాం. నా నిశ్చితార్థం 400 ఏళ్ల నాటి గుడిలో చేసుకున్నాను. ఈ గుడితో మా ఫ్యామిలీకి నాకు ప్రత్యేక అనుబంధం ఉంది అంటూ చెప్పుకోచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

