Covishield Vaccine | న్యూఢిల్లీ, మే 1: కొవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలపై తయారీ సంస్థ ఆస్ట్రాజెనికా చేసిన ప్రకటన ఆ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో భయాందోళనలు రేపుతున్నది.అయితే ప్రజల అనుమానాలను వైద్య నిపుణులు కొట్టిపారేస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకొన్న వారు భయపడాల్సిన అవసరం లేదని, అంటువ్యాధులు నిపుణుడు డాక్టర్ రమాన్ గంగాఖేడ్కర్ స్పష్టం చేశారు.
ప్రతి 10 లక్షల మందికి 7-8 మందిలో మాత్రమే రక్తం గడ్డకట్టే రిస్క్ ఉంటుందని, అది కూడా మొదటి డోసు తీసుకొన్న సమయంలోనే ఉంటుందని పేర్కొన్నారు. తర్వాతి డోసుల సమయానికి ఆ రిస్క్ పూర్తిగా తగ్గుతుందని, ఏమైనా దుష్ప్రభావాలు చూపిస్తే, అది మొదటి 2-3 నెలల్లోనే జరుగుతుందని చెప్పారు.