TS Weather | దంచికొడుతున్న ఎండలు..! వర్షాలపై కీలక అప్డేట్ ఇచ్చిన వాతావరణశాఖ..!
TS Weather | తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపిస్తుండడంతో జనం వణికిపోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయి. బుధవారం అత్యధికంగా నల్గొండ జిల్లా గూడపూర్‌లో 46.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
TS Weather | తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపిస్తుండడంతో జనం వణికిపోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయి. బుధవారం అత్యధికంగా నల్గొండ జిల్లా గూడపూర్‌లో 46.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే రోజుల్లో 47 డిగ్రీల మార్క్‌ను దాటే అవకాశం ఉందని వాతావరణ విభాగం అధికారులు హెచ్చరిస్తున్నారు. గురువారం నుంచి శనివారం వరకు దీర్ఘకాల వడగాలులు కొనసాగుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది. అలాగే, ఈ నెల 6 నుంచి రాష్ట్రంలో తేలికపాటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
గురువారం జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు కొనసాగుతాయని హెచ్చరించింది. శుక్రవారం కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడ వడగాలులు వీస్తాయని చెప్పింది. ఈ నెల 6న రాష్ట్రం నుంచి పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. సోమవారం కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

