Boxing | అస్తానా: ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ బాక్సర్లు అదరగొడుతున్నారు. బుధవారం నలుగురు బాక్సర్లు సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధించారు. 51 కిలోల విభాగంలో ఆర్యన్ 5-0 తేడాతో ఉజ్బెకిస్థాన్ బాక్సర్ జురెవ్పై అలవోకగా నెగ్గాడు.
71 కిలోల విభాగంలో ప్రియాన్షు, 80 కేజీల కేటగిరీలో సాహిల్ రిఫరీ స్టాప్ ది కాంటెస్ట్ (ఆర్ఎస్సీ) నిర్ణయంతో విజయాలు నమోదుచేశారు. యశ్వర్ధన్ (63.5 కిలోలు) 4-1 తేడాతో ఇరాన్ బాక్సర్ బాబాహైదరిని ఓడించి సెమీస్‌కు చేరాడు. ఈ టోర్నీలో ఇదివరకే బ్రిజేష్, సాగర్, సుమిత్, జుగ్ను, తమన్నా, ప్రీతి సెమీఫైనల్స్ చేరారు.