Hari Hara Veera Mallu | ‘హరిహర వీరమల్లు నుంచి తప్పుకున్న క్రిష్.. కొత్త డైరెక్టర్ ఇతడే.!
Krish Jagarlamudi | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu). పిరియడికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న విషయం తెలిసిందే. ఏపీ ఎన్నికల అనంతరం మళ్లీ షూటింగ్లో జాయిన్ కానున్నాడు పవన్. అయితే చాలా రోజుల తర్వాత ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు మేకర్స్.
Krish Jagarlamudi | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu). పిరియడికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న విషయం తెలిసిందే. ఏపీ ఎన్నికల అనంతరం మళ్లీ షూటింగ్లో జాయిన్ కానున్నాడు పవన్. అయితే చాలా రోజుల తర్వాత ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు మేకర్స్. ఇక ఈ మూవీ టీజర్ గమనిస్తే.. పేదలు దోపిడీకి గురవుతూ, ధనవంతులు మరింత అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో.. న్యాయం కోసం యుద్ధం చేసే ఒంటరి యోధుడుగా పవన్ కల్యాణ్ కనిపించబోతున్నారు. 17వ శతాబ్దంలో పేదల పక్షాన పోరాడిన ఒక యోధుడి పాత్రలో పవన్ కనిపించున్నారు. అయితే ఈ సినిమాను క్రిష్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి క్రిష్ తప్పుకున్నట్లు తెలుస్తుంది. ఇదే విషయంపై చిత్రబృందాన్ని ట్యాగ్ చేస్తూ నెటిజన్లు పోస్ట్‌లు పెట్టారు. ఈ సినిమా నుంచి క్రిష్ వైదొలిగారా అనే కామెంట్స్ మొదలయ్యాయి. తాజాగా వారందరికీ నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు.
ఈ సినిమా నుంచి జాగర్లమూడి కృష్ణ (క్రిష్) తప్పుకున్నట్లు వెల్లడించారు. ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా కంప్లీట్ కావాల్సి ఉండగా.. ఈ మిగిలిన షూటింగ్‌ను పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను రూల్స్ రంజన్ (Rules Ranjan) దర్శకుడు జ్యోతి కృష్ణ పూర్తిచేయనున్నట్లు తెలిపారు. ఇక రెండు భాగాలుగా వస్తున్న ఈ చిత్రం మొదటి పార్ట్ ‘హరిహర వీరమల్లు పార్ట్: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో ప్రేక్షకుల రాబోతున్నది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులు యాసంగిలో వరి వేయొద్దు : దాసరి హరిచందన
మేడిగడ్డ దగ్గర బాంబ్ పేలిన శబ్దం వచ్చింది..! దీనిపై విచారణ జరపాలి : మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు
Multi Starrer | ఎన్టీఆర్, అల్లు అర్జున్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్.. కథ కూడా వినిపించారా?
Maruti Patel Dongre | ప్రభుత్వ వైఫల్యంతోనే ఎండిపోతున్న పంటలు : మారుతి పటేల్ డోంగ్రే
‘క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తిస్తే సంపూర్ణ చికిత్స’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

