Champions Trophy | కరాచీ: వచ్చే ఏడాది జరగాల్సి ఉన్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమిస్తున్న పాకిస్థాన్.. భారత్‌ను ఎలాగైనా తమ దేశానికి రప్పించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ మెగా టోర్నీ కోసం లాహోర్, కరాచీ, రావల్పిండి వేదికలను ఖరారుచేసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ).. భారత్ ఆడే మ్యాచ్‌లను లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో మాత్రమే జరిపిస్తామని, భద్రత విషయంలో టీమ్ఇండియాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని ఐసీసీకి విన్నవించనున్నట్టు బోర్డు వర్గాల సమాచారం. అయితే ఈ ప్రతిపాదన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని సంప్రదించకుండానే చేస్తున్నట్టు తెలుస్తోంది.