హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): వాడపల్లి పోలీస్ స్టేషన్లో కస్టోడియల్ టార్చర్‌కు గురైన బాధితుడు సాయిసిద్ధుకు రూ.50 వేల నష్టపరిహారం ఎందుకు ఇవ్వకూడ దో వివరణ ఇవ్వాలని జాతీయ మాన వ హకుల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వ ప్ర ధాన కార్యదర్శితోపాటు నల్లగొండ కలెక్టర్‌ను ఆదేశించింది. నిరుడు వాడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో యూరియా కోసం రైతులు నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నందుకు సాయిసిద్ధును ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి, పోలీస్ సిబ్బంది కులం పేరుతో దూషిస్తూ దాడికి పాల్పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై బాధితుడు వీడియో విడుదల చేయడంతో హైకోర్టు న్యాయవాది రేవంత్ ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. శుక్రవారం కేసు విచారణ చేపట్టిన కమిషన్.. బాధితునికి రూ.50 వేల నష్టపరిహారం ఎందుకు అందించకూడదో వివరించాలని సీఎస్, కలెక్టర్‌కు ఆదేశాలు జారీచేసింది.