హైదరాబాద్, ఆగస్టు 10, (నమస్తే తెలంగాణ) : ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు కాలం తెచ్చింది కాదని, కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన కృత్రిమ కరువు అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కురువ విజయ్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురువాలని కోరుతూ ప్రభుత్వం వరుణ యాగం నిర్వహించడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ వరుణిడిని ప్రార్థించే ముందు నీటి నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వర్షాల కోసం కేవలం యాగాలు చేయడమే కాదని, సమర్థమైన ప్రణాళిక, నీటి నిర్వహణ వ్యవస్థ ఎంతో అవసరమని హితవు పలికారు.