Couple Goals | భార్య అలిగిందా? బుజ్జగించడానికి ఖరీదైన గిఫ్టులు అవసరం లేదు.. ఇవి చేస్తే చాలు
Couple Goals | ఆడవారి అలకను తగ్గించడంలో అవతలి వ్యక్తి చూపించే చిన్న శ్రద్ధే ఆ బంధానికి పెద్ద బలం. ఆమె అలిగితే ఏం చేయాలి? పదేపదే ‘ఏమైంది?’ అని అడగాలా? ‘నీ ఇష్టం’ అంటూ తన పనిలో తాను మునిగిపోవాలా?
Couple Goals | ఆడవారి అలకను తగ్గించడంలో అవతలి వ్యక్తి చూపించే చిన్న శ్రద్ధే ఆ బంధానికి పెద్ద బలం. ఆమె అలిగితే ఏం చేయాలి? పదేపదే ‘ఏమైంది?’ అని అడగాలా? ‘నీ ఇష్టం’ అంటూ తన పనిలో తాను మునిగిపోవాలా? లేదా ఏదో ఒకటి మాట్లాడి ఆమెను నవ్వించాలా? నిజానికి అలక వెనుక ఉన్న కారణాన్ని అర్థం చేసుకోవడమే మొదటి అడుగు. కొన్నిసార్లు చిన్న నిర్లక్ష్యం, మరికొన్ని సార్లు చెప్పిన మాటకు విలువ ఇవ్వకపోవడం.. ఇలా ఎన్నో విషయాలు మనసును నొప్పిస్తాయి.
ముందు వినండి..
ఆమె తన బాధను చెప్పుకొంటున్నప్పుడు వెంటనే సమర్థించుకోవడం, ఎదుటివారిపై తప్పు నెట్టడం పరిస్థితిని మరింత జటిలం చేయవచ్చు. ఆమె చెప్పేది పూర్తిగా విని, ‘నీకు అలా అనిపించడం సహజమే’ అని భావాలను గౌరవించడం అవసరం. తప్పు తనదైతే నిజాయితీగా క్షమాపణ చెప్పాలి. ఆ మాటలో నిజాయితీ ఉంటేనే మనసుకు ఊరట కలుగుతుంది.
ఇలా చేయొచ్చు..
ఆమెకు ఇష్టమైన కాఫీ అందించడం, కాసేపు పకన కూర్చోవడం, మనసుకు నచ్చిన చోటుకు తీసుకెళ్లడం, చిన్న సందేశం పంపడం.. ఇలాంటి ప్రయత్నాలు అలకను తగ్గించవచ్చు. ఆ చిన్న ప్రయత్నం ఆమెకు పెద్ద సంతోషం కలిగించొచ్చు. అయితే ఆమెకు కొంత సమయం ఒంటరిగా ఉండాలనిపిస్తే మాత్రం ఆ అవకాశాన్ని గౌరవించాలి. బలవంతంగా మాట్లాడించడానికి ప్రయత్నించకూడదు.
మార్పే ముఖ్యం
అలక తగ్గిన తర్వాత అసలు సమస్య గురించి ప్రశాంతంగా మాట్లాడుకోవాలి. ఏ విషయం బాధించిందో తెలుసుకుని, మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలి. ప్రతిసారీ బహుమతులు ఇవ్వడం కంటే, ఆమె మాటలకు విలువ ఇవ్వడం, బాధ్యతలను పంచుకోవడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఎంతో ముఖ్యం. భార్య లేదా ప్రేయసి అలిగినప్పుడు ఆమెను బుజ్జగించడం అంటే కేవలం నవ్వించడం కాదు. ఆమె భావాలను అర్థం చేసుకుని, తనకు ఈ బంధంలో ప్రత్యేక స్థానం ఉందనే భరోసా కల్పించడం.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Explosion In Building | నిర్మాణంలో ఉన్న భవనంలో పేలుడు.. ఐఈడీగా పోలీసులు అనుమానం
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో లోయలో పడ్డ బస్సు.. ఇద్దరు మృతి.. 15 మందికి గాయాలు
Telangana RTC Union Elections | తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఈయూ ఘన విజయం
Ramayana | ‘రామాయణం’ మూవీకి ‘యూ’ సర్టిఫికెట్.. రన్టైమ్ ఎంతంటే?
Vijayadashami Celebrations | తోడసం వంశస్తుల ఆధ్వర్యంలో ఘనంగా విజయదశమి వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

