హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): అమన్‌గల్ డివిజన్ పరిధిలోని గుర్రంగూడ అటవీ ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించింది. మొత్తం 424.31 ఎకరాల విస్తీర్ణం గల ఈ అటవీ భూభాగాన్ని రిజర్వ్ ఫారెస్ట్‌గా గుర్తిస్తూ పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతానికి ఈ ప్రాంతం రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వస్తుంది. ఈ నిర్ణయంతో అటవీ భూములకు చట్టపరమైన రక్షణ లభిస్తుందని అటవీ దళాల ముఖ్య సంరక్షణాధికారి డాక్టర్ సీ సువర్ణ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని భారీ అర్బన్ ఫారెస్ట్ పార్క్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. హైదరాబాద్ నగరీకరణ నేపథ్యంలో ప్రాంతం గ్రీన్ స్పేస్‌గా మారనున్నట్టు వివరించారు.