హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): ‘కేసీఆర్ మార్’ దూకుడు పాలనకు బ్రేకులు పడ్డాయా? తొలి పదేండ్లలో ఏటా 12-15 శాతం వృద్ధి సాధించిన రాష్ట్రం, ఇప్పుడు 5 శాతం వృద్ధికే పరిమితమైందా? బడ్జెట్లో అంకెలు కనిపిస్తున్నా, క్షేత్రస్థాయిలో వృద్ధి వేగం మందగించిందా?.. అంటే గత రెండేండ్ల బడ్జెట్ గణాంకాలు అవుననే చెప్తున్నాయి. కేసీఆర్ దార్శనికతతో దశాబ్ద కాలంపాటు ఏటా 15 శాతం వృద్ధితో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం.. నేడు దిశానిర్దేశం లేని పాలనలో తడబడుతున్నది. గతంలో ప్రాజెక్టుల నిర్మాణం, సంపద సృష్టి లక్ష్యంగా బడ్జెట్ సాగితే, నేడు కేవలం అప్పులు తెచ్చి ‘గ్యారెంటీల’ ఓట్లు కాపాడుకునే అంకెల గారడీగా మారిపోయింది. వృద్ధి రేటు పాతాళానికి పడిపోవడం, కొత్త ప్రాజెక్టులకు నిధులు లేకపోవడం వెరసి రేవంత్‌రెడ్డి పాలనలో తెలంగాణ ఆర్థిక చక్రం రివర్స్‌గేర్‌లో వెళ్తున్నదా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
నెమ్మదించిన వృద్ధి రేటు
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన 2024-2026 మధ్య బడ్జెట్లను పరిశీలిస్తే, కేసీఆర్ కాలం నాటి ఆ ‘ఆర్థిక దూకుడు’ కనిపిస్తలేదనే విమర్శలున్నాయి. కేసీఆర్ హయాంలో బడ్జెట్ ఏటా సగటున 12 నుంచి 15 శాతం వరకు పెరుగుతూ వచ్చింది. కానీ, రేవంత్ సరార్లో ఈ వృద్ధి రేటు ఒకసారిగా పడిపోయింది. 2024-25లో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2.91 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ, కేసీఆర్ ప్రభుత్వం 2023-24లో ప్రవేశపెట్టిన రూ.2.90 లక్షల కోట్లతో పోలిస్తే వృద్ధి 0.2 శాతం కంటే తకువ. అంటే దాదాపు స్తబ్ధత నెలకొంది. 2025-26 బడ్జెట్ సుమారు రూ.3.05 లక్షల కోట్లుగా ఉన్నది. ఇది గత ఏడాదితో పోలిస్తే కేవలం 4.8 శాతం వృద్ధి మాత్రమే.
కేసీఆర్ హయాంలో ఉన్న 12-15 శాతం వృద్ధి రేటుతో పోలిస్తే ఇది చాలా తకువ. భారీ బడ్జెట్ అంచనాలు వేస్తున్నా ‘ఆరు గ్యారెంటీలకు’ నిధుల సర్దుబాటు చేయడం ప్రస్తుత ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారింది. రాష్ట్ర ఆదాయ వనరులు, అప్పుల భారాన్ని విశ్లేషిస్తే, 2026-27 బడ్జెట్ అంచనాలు రూ.3.20 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కేసీఆర్ హయాంలో లాగా మౌలిక సదుపాయాలపై పెట్టుబడి తగ్గే అవకాశం ఉన్నదని, కేవలం అప్పుల వడ్డీలు, సంక్షేమ పథకాల నిర్వహణకే ఎకువ నిధులు సరిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేసీఆర్ వేసిన పటిష్టమైన ఆర్థిక పునాదులను కాపాడుకోవడంలో రేవంత్ సరార్ తడబడుతున్నదని అంటున్నారు.
కేసీఆర్, రేవంత్ పాలన మధ్య తేడా
కేసీఆర్ హయాంలో ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల కోసం బడ్జెట్లో 15-20 శాతం నిధులు కేటాయించేవారు. కానీ, 2025-26 బడ్జెట్లో మూలధన వ్యయం కేవలం రూ.36,504 కోట్లు మాత్రమే. అంటే మొత్తం బడ్జెట్లో ఇది 12 శాతం మాత్రమే. మిగిలిన నిధులన్నీ కేవలం జీతాలు, పెన్షన్లు, అప్పుల వడ్డీలకే ఖర్చు చేస్తున్నారు. వ్యవసాయ రంగాన్ని రేవంత్ సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది. 2024-25లో వ్యవసాయానికి బడ్జెట్లో 25 శాతం వాటా ఉండగా, 2025-26 నాటికి అది 8 శాతానికి పడిపోయింది. రైతు భరోసా అమలులో జాప్యం దీనికి ప్రధాన కారణం. ఇప్పటికే మూడు విడతల రైతు భరోసాను రేవంత్ సర్కారు ఎగ్గొట్టింది. కేసీఆర్ అప్పులు చేశారని విమర్శించిన కాంగ్రెస్ సర్కార్, ప్రస్తుతం అంతకంటే వేగంగా అప్పులు చేస్తున్నదని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
2025-26 నాటికి రాష్ట్ర అప్పు రూ.5.05 లక్షల కోట్లు దాటుతుందని అంచనా. కేవలం అప్పులకు వడ్డీల చెల్లింపు కోసమే ప్రభుత్వం తన ఆదాయంలో దాదాపు 8-10 శాతం వెచ్చించాల్సి వస్తున్నది. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు, రైతుబంధు లాంటి పథకాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారు. కానీ రేవంత్‌రెడ్డి పాలనలో బడ్జెట్ అంకెలు పెరుగుతున్నా, కొత్తగా ఒక ప్రాజెక్టు కానీ, పరిశ్రమకానీ వచ్చిన దాఖలాలు లేవు. ఎన్నికల హామీల అమలు కోసం కేటాయింపులు జరుపుతూ, రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2026-27 బడ్జెట్ అంచనాలు రూ.3.20 లక్షల కోట్లకు చేరినా, అది కేవలం కాగితాలకే పరిమితం అవుతుందే తప్ప మరొకటి కాదని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేశారు.
దార్శనికత వర్సెస్ నిర్వహణ
