బోనమెత్తిన నగరం
డప్పు చప్పుళ్లు.. పోతురాజుల నృత్యాలు.. అమ్మవారి నామస్మరణతో నగరంలోని ఆలయాలు మార్మోగాయి. హైదరాబాద్‌లో ఆదివారం బోనాల వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పాతబస్తీ లాల్‌దర్వాజా సింహవాహని మహంకాళి ఆలయంతో పాటు నగరవ్యాప్తంగా మహంకాళిఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి.
- వైభవంగా లాల్‌దర్వాజా బోనాల జాతర
- అశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం.. బోనాల సమర్పణ
- నగరవ్యాప్తంగా కిటకిటలాడిన అమ్మవారి దేవాలయాలు
డప్పు చప్పుళ్లు.. పోతురాజుల నృత్యాలు.. అమ్మవారి నామస్మరణతో నగరంలోని ఆలయాలు మార్మోగాయి. హైదరాబాద్‌లో ఆదివారం బోనాల వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పాతబస్తీ లాల్‌దర్వాజా సింహవాహని మహంకాళి ఆలయంతో పాటు నగరవ్యాప్తంగా మహంకాళిఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. అశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులు.. అమ్మవార్లకు బోనాలు సమర్పించి.. మొక్కులు చెల్లించుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నగరంలోని పలు ఆలయాలను సందర్శించి.. అమ్మవార్లకు పట్టువస్ర్తాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
– సిటీబ్యూరో, ఆగస్టు 9(నమస్తేతెలంగాణ)

పలు ఆలయాల్లో కేటీఆర్ ప్రత్యేక పూజలు
లాలాదర్వాజా సింహవాహిని అమ్మవారి ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులందరూ సంతోషంగా ఉండాలని, హైదరాబాద్‌లో వ్యాపారాలు బాగా సాగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆకాంక్షించారు. బోనాల ఉత్సవాల సందర్భంగా ఆదివారం ఆయన నగరంలోని పలు ఆలయాలను దర్శించి అమ్మవార్లకు పట్టు వస్ర్తాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నాంపల్లిలోని ఏడుగుళ్ల పోచమ్మ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసిన అనంతరం చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
అక్కడి నుంచి ఓల్డ్ సిటీలోని బంగారు మైసమ్మ, అక్కన్న మాదన్న మహంకాళి ఆలయాన్ని దర్శించి పూజలు చేశారు. లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం మీరాలం శ్రీమహంకాళి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి కేటీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. అటునుంచి అంబర్‌పేట నియోజకవర్గంలోని శ్రీమహంకాళి అమ్మవారి ఆలయం, లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న కనకాల కట్ట మైసమ్మ దేవాలయం, బల్కంపేట ఎల్లమ్మ ఆలయాలను సందర్శించి.. అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.

హైదరాబాద్ నగరంలో ప్రజలు ఆదివారం బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, తొట్టెల ఊరేగింపు, బాజా బజంత్రీలతో మహిళలు నెత్తిన బోనాలు పెట్టుకొని అమ్మవార్ల ఆలయాల్లో బోనాలు సమర్పించారు. వేడుకల్లో రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులు, సినీ నటులు పాల్గొని సందడి చేశారు. వర్షాలు సమృద్ధిగా పడి సల్లంగ చూడు తల్లీ అని అమ్మవారిని వేడుకున్నారు.
– నమస్తే తెలంగాణ







Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

