బ్యాంకాక్: సన్యాసి అయిన దత్త పుత్రుడితో రాజకీయ నాయకురాలి సంబంధాన్ని ఆమె భర్త బట్టబయలు చేశాడు. (Thai female politician) వారిద్దరూ బెడ్‌పై ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అతడు రికార్డ్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో రాజకీయంగా సంచలనం రేపింది. థాయ్‌లాండ్‌లో ఈ సంఘటన జరిగింది. సెంట్రల్ థాయిలాండ్‌లోని సుఖోథాయ్ ప్రావిన్స్‌కు చెందిన 45 ఏళ్ల ప్రపపోర్న్ చోయివాడ్కో ప్రముఖ రాజకీయ నాయకురాలు. డెమోక్రాట్ పార్టీ సభ్యురాలైన ఆమె ప్రస్తుతం స్థానిక చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షురాలు.
కాగా, 65 ఏళ్ల భర్త, ఆమె కలిసి గత ఏడాది ఒక ఆలయానికి చెందిన 24 ఏళ్ల సన్యాసి ఫ్రా మహాను కుమారుడిగా దత్తత తీసుకున్నారు. అయితే భార్య, దత్త పుత్రుడైన ఆ సన్యాసి మధ్య ఎఫైర్ ఉందని భర్త అనుమానించాడు. వారిద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు ఐదు గంటలు ప్రయాణించి ఇంటికి చేరుకున్నాడు. బెడ్‌పై వారిద్దరూ సన్నిహితంగా ఉండటం చూసి కంగుతిన్నాడు. దీనిని రికార్డ్ చేయడంతో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో థాయిలాండ్‌తోపాటు సమీప దేశాల్లో ఇది కలకలం రేపింది.
మరోవైపు దత్తపుత్రుడితో సంబంధం ఉన్నట్లుగా వచ్చిన వార్తలను చోయివాడ్కో ఖండించింది. అతడితో శృంగారంలో పాల్గొనలేదని, కేవలం చాట్ చేసినట్లు తెలిపింది. పరారీలో ఉన్న ఆ సన్యాసి కూడా తమ ఇద్దరి మధ్య ఏమీ జరుగలేదని చెప్పాడు. అయితే ఈ స్కాండల్‌పై దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో చోయివాడ్కోను సస్పెండ్ చేసినట్లు ఆ పార్టీ పేర్కొంది.