Rains | దుబాయిలో మళ్లీ భారీ వర్షాలు.. విమాన సర్వీసులు రద్దు
Rains | దుబాయిలో మళ్లీ భారీ వర్షాలు కురిశాయి. గత నెలలో కురిసిన కుండపోత వానను మరువకముందే.. మరోసారి దుబాయిని వర్షాలు ముంచెత్తడంతో జనజీవనం స్తంభించిపోయింది. అంతేకాదు రవాణా సౌకర్యానికి తీవ్ర ఆటంకం కలిగింది.
Rains | దుబాయిలో మళ్లీ భారీ వర్షాలు కురిశాయి. గత నెలలో కురిసిన కుండపోత వానను మరువకముందే.. మరోసారి దుబాయిని వర్షాలు ముంచెత్తడంతో జనజీవనం స్తంభించిపోయింది. అంతేకాదు రవాణా సౌకర్యానికి తీవ్ర ఆటంకం కలిగింది. దుబాయి నుంచి ఇతర దేశాలకు వెళ్లే విమాన సర్వీసులను రద్దు చేశారు. పలు విమానాలను దారి మళ్లించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గురువారం తెల్లవారుజామున 3 గంటల నుంచి భారీ వర్షాలు కురిసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈదురు గాలులు కూడా బలంగా వీచినట్లు పేర్కొంది. ఇక మే 3వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దుబాయి వాతావరణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అబుదాబిలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. బలమైన ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి.
గత నెలలో కురిసిన వర్షాలు దుబాయిని ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14, 15 తేదీల్లో భారీ వర్షాలు కురిశాయి. 1949 నుంచి ఇప్పటి వరకు అంతటి భారీ వర్షం కురవలేదని దుబాయి అధికారులు వెల్లడించారు. భారీ వర్షాలకు పలువురు మృతి చెందిన సంగతి తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

