Devara Movie | 2024లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులే కాకుండా ప్రేక్షకులు సైతం ఎదురుచూస్తున్న చిత్రం దేవర. ఎన్టీఆర్(NTR), కొరటాల శివ(Koratala Shiva) కాంబోలో ఈ సినిమా వస్తుండడంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ఈ సినిమా వస్తుండగా.. ఈ చిత్రంలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా గ్లింప్స్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా వస్తున్న విషయం తెలిసిందే. మొదటి పార్ట్ దసరా కానుకగా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ నుంచి సర్ప్రైజ్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ బర్త్ డే (మే 20) కానుకగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ లాంచ్ అవ్వనున్నట్లు టాక్. కాగా దీనిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వవలసి ఉంది.
మరోవైపు ఈ సినిమాతో తారక్ సోలోగా బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తుంది. దసరా కానుకగా ఈ మూవీ వస్తుండగా.. దేవరకు పోటీగా చుట్టుపక్కల ఏ మూవీ లేకపోవడం విశేషం. ఇంతకుముందు నాగచైతన్య తండేల్ సినిమా కూడా దసరా బాక్సాఫీస్ బరిలో దిగుతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ మళ్లీ రేసు నుంచి తప్పుకున్నారు. అయితే ఆరేళ్ల తర్వాత తారక్ సోలోగా బాక్సాఫీస్ బరిలోకి దిగుతుండడంతో దేవరకు భారీగా కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. తారక్ చివరిగా అరవింద సమేత సినిమాతో సోలోగా బాక్సాఫీస్ ముందుకు వచ్చాడు. 2018లో త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత 2019 నుంచి 21 వరకు ఎన్టీఆర్ సినిమాలే రిలీజ్ కాలేదు. ఇక తర్వాత 2022లో రామ్ చరణ్‌తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా చేశాడు. మళ్లీ 2023లో ఏ సినిమా రిలీజ్ కాలేదు. ఇప్పుడు 2024లో అంటే దాదాపు ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలోగా వస్తున్నాడు.