Prasanth Varma | సినిమా అంటే పిచ్చి ఉన్నవారికి ‘హనుమాన్’ దర్శకుడు బంఫర్ ఆఫర్
Hanuman Movie | పాన్ ఇండియా లేటెస్ట్ సెన్సేషన్ ప్రశాంత్‌వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘హనుమాన్’. తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి వరల్డ్‌వైడ్‌గా రూ.250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇదిలావుంటే ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ వస్తున్నట్లు ప్రశాంత్ వర్మ ప్రకటించారు.
Hanuman Movie | పాన్ ఇండియా లేటెస్ట్ సెన్సేషన్ ప్రశాంత్‌వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘హనుమాన్’. తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి వరల్డ్‌వైడ్‌గా రూ.250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇదిలావుంటే ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ వస్తున్నట్లు ప్రశాంత్ వర్మ ప్రకటించారు. రీసెంట్గా శ్రీ రామ నవమి సందర్భంగా మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా పంచుకున్నాడు. ఇక ఈ పోస్టర్లో రాముడి చేతిలో హనుమంతుడు చేయి వేసినట్లు పోస్టర్ కనిపిస్తుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి సాలిడ్ న్యూస్ అందించాడు ప్రశాంత్ వర్మ.
‘హనుమాన్’, ‘జై హనుమాన్’ సినిమాలు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగమన్న విషయం తెలిసిందే. ఈ యూనివర్స్‌లో మరిన్ని సూపర్ హీరో పాత్రలను తీసుకురానున్నట్లు ప్రశాంత్ ప్రకటించాడు. తాజాగా దీనికి సంబంధించి అప్డేట్ పంచుకున్నాడు. సినిమాలు అంటే పిచ్చి ఉన్నా
ప్రతిభావంతులు అందరూ తన పీవీసీయూ (ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్) చేరాల్సిందిగా ఆహ్వానించాడు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు.
కళాకారులందరం సూపర్ పవర్స్ గురించి మాట్లాడుకుందాం. మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెట్టే మీ ప్రత్యేక నైపుణ్యం ఏమిటి? ఇది స్పిన్నింగ్ టేల్స్, అతుకులు లేని ఎడిటింగ్, మంత్రముగ్ధులను చేసే నైపుణ్యం కలిగిన గ్రాఫిక్స్ అయినా లేదా బహుశా మీరు మార్కెటింగ్ మేవెన్ అయినా, మీ తెలివిగల నైపుణ్యాలతో ప్రపంచానికి జీవం పోస్తున్నారా? మీ కళాత్మక సూపర్ పవర్‌ను మాతో పంచుకోండి మనం కలిసి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేద్దాం! మాతో చేరడానికి మీ పోర్ట్‌ఫోలియోలను “talent@thepvcu.com”కి పంపండి. PVCUలో కలుద్దాం!
Calling all artists, let’s talk Superpowers!
What’s your special skill that makes you stand out? Whether it’s spinning tales, seamless editing, skilful graphics that enchant or perhaps you’re the marketing maven, breathing life into worlds with your savvy skills?
Share your… pic.twitter.com/BYg7eLg5w6
— Prasanth Varma (@PrasanthVarma) May 2, 2024
ఇక ఈ చిత్రం ‘రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏమిటి?’ అన్న స్టోరీతో రానుంది. ఇక ఈ పోస్టర్ చూసిన ఆడియన్స్ థ్రిల్‌గా ఫీలవుతున్నారు. ఈ సినిమాను 2025 విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

