T20 World Cup 2024 : ప్రతిష్ఠాత్మక టీ20 వరల్డ్ కప్ సమరం మరో 18 రోజుల్లో షురూ కానుంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మోగా టోర్నీ కోసం అన్ని జట్లు తుది స్క్వాడ్‌ను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే అంబాసిడర్లు వరల్డ్ కప్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ఈ సమయంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది.
ఫైనల్ బెర్తును నిర్ణయించే రెండో సెమీఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డే(Reserve Day) లేదని ఐసీసీ స్పష్టం చేసింది. అయితే.. ఎట్టి పరిస్థితుల్లోనే అదే రోజు మ్యాచ్ నిర్వహిస్తామని, ఒకవేళ ఆలస్యమైతే.. 4 గంటల సమయం అదనంగా కేటాయించనున్నామని ఐసీసీ వెల్లడించింది.
పొట్టి ప్రపంచకప్‌లో జూన్ 26న మొదటి సెమీఫైనల్ ట్రినిడాడ్‌లో జరుగనుంది. ఆరోజు ట్రినిడాడ్‌లో వర్షం పడే సూచన ఉండడంతో అధికారులు రిజర్వ్ డే ఉంటుందని చెప్పారు. ఒకవేళ వాన కారణంగా 26న మ్యాచ్ జరుగకున్నా.. పూర్తి కాకున్నా 27న ఆడిస్తారు.
అయితే.. జూన్ 27న రెడో సెమీఫైనల్ జరిగే గయానాలో పరిస్థితులు వేరు. ఉదయం 10 30 గంటలకు(భారత కాలమానం ప్రకారం రాత్రి 830 గంటలు) మ్యాచ్ ఆరంభం కానుంది. అదే రోజున మ్యాచ్ పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఐసీసీ మరో నాలుగ్గంటలు అదనపు సమయం ఇచ్చింది. దాంతో, ఇదెక్కడి రూల్? అంటూ అభిమానులు ఐసీసీ తీరును ప్రశ్నిస్తున్నారు. జూన్ 28 ట్రావెల్ డే కాగా.. జూన్ 29న పొట్టి ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.