Elections | ఎన్నికల్లో వేసే సిరా గుర్తు ఎందుకు అంత తొందరగా పోదు? అసలు బ్లూ ఇంక్ వెనుక ఉన్న హిస్టరీ ఏంటి?
Elections | ఎన్నికలు అంటే గుర్తొచ్చేది సిరా గుర్తు! చూపుడు వేలిపై వేసే ఈ సిరా గుర్తు మనం ఓటు వేశామో లేదో చెబుతుంది.. అలాగే దొంగ ఓట్లు పడకుండా అడ్డుకుంటుంది. చేతి వేలిపై వేసిన బ్లూ ఇంక్ తొందరగా చెరిగిపోదు కాబట్టి ఎన్నికల అధికారులు దశాబ్దాలుగా దీన్ని ఓటింగ్‌లో వినియోగిస్తున్నారు. మరి ఇంత ప్రత్యేకమైన ఇంక్ ఎవరికైనా అందుబాటులో ఉంటుందా? దీని మరక అంత తొందరగా పోదు? దీన్ని ఎవరు తయారు చేస్తారు? అసలు ఈ చెరిగిపోని సిరా వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Elections | ఎన్నికలు అంటే గుర్తొచ్చేది సిరా గుర్తు! చూపుడు వేలిపై వేసే ఈ సిరా గుర్తు మనం ఓటు వేశామో లేదో చెబుతుంది.. అలాగే దొంగ ఓట్లు పడకుండా అడ్డుకుంటుంది. చేతి వేలిపై వేసిన బ్లూ ఇంక్ తొందరగా చెరిగిపోదు కాబట్టి ఎన్నికల అధికారులు దశాబ్దాలుగా దీన్ని ఓటింగ్‌లో వినియోగిస్తున్నారు. మరి ఇంత ప్రత్యేకమైన ఇంక్ ఎవరికైనా అందుబాటులో ఉంటుందా? దీని మరక అంత తొందరగా పోదు? దీన్ని ఎవరు తయారు చేస్తారు? అసలు ఈ చెరిగిపోని సిరా వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ బ్లూ ఇంక్‌ను ఎప్పుడు తీసుకొచ్చారు?
దేశంలో తొలిసారి ఎన్నికలు నిర్వహించిన సమయంలో ఎన్నికల సంఘం చాలా సమస్యలు ఎదుర్కొంది. వాటిలో ముఖ్యమైనది దొంగ ఓట్లు. ఒకసారి ఓటు వేసిన వాళ్లు మళ్లీ మళ్లీ వస్తుండటంతో వావటిని ఎలా అడ్డుకోవాలో తెలియక ఎన్నికల అధికారులు తలలు పట్టుకున్నారు. ఆ తర్వాత సుదీర్ఘ మేదో మథనం తర్వాత చేతి వేలిపై చెరిగిపోని సిరా గుర్తు వేయాలనే ఆలోచన వచ్చింది. అదే బ్లూ ఇంక్ పద్దతి. దొంగ ఓట్లకు చెక్ పెట్టేందుకు తీసుకొచ్చిన ఈ బ్లూ ఇంక్ పద్ధతిని దశాబ్దాలుగా ఎలక్షన్ కమిషన్ అమలు చేస్తున్నది.
1962 ఎన్నికల్లో తొలిసారిగా ఈ చెరగని సిరాను ఉపయోగించారు. సుకుమార్ సేన్ కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్నప్పుడు దీన్ని తీసుకొచ్చారు. అప్పట్నుంచి ప్రతి ఎన్నికల్లోనూ ఈ సిరాను వాడుతున్నారు. 2019 ఎన్నికల సమయంలో రూ.33 కోట్ల ఖర్చుతో 26 లక్షల వయల్స్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఉపయోగించింది. అయితే ఈసారి 26.55 లక్షల వయల్స్‌ను ఆర్డర్ చేసింది. దీనికోసం రూ.55 కోట్ల వరకు ఖర్చు చేసింది. ఎన్నికల సంఘం ఆర్డర్ చేసిన వయల్స్ ఒక్కో దాంట్లో 10 మిల్లీ లీటర్ల సిరా ఉంటుంది. ఒక్క సీసాతో దాదాపు 700 మంది ఓటర్ల వేళ్లపై సిరా గుర్తు వేయవచ్చు.
ఎవరు తయారు చేస్తారు?
ఓటు వేసిన వారి చూపుడు వేలిపై రాసే ఈ స్పెషల్ ఇంక్‌ను భారత ఎన్నికల సంఘం మాత్రమే తయారు చేయిస్తుంది. మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ (MPVL ) అనే సంస్థ ఒక్కటే ఈ ఇండెలబుల్ ఇంక్‌ను తయారు చేస్తుంది. దీని తయారీ ఫార్ములా చాలా రహస్యంగా ఉంచుతారు. ఎంపీవీఎల్ డైరెక్టర్లకు కూడా ఈ ఫార్ములా తెలియదు. కేవలం సంస్థలో పనిచేసే ఇద్దరు కెమిస్ట్‌లకు మాత్రమే ఈ ఇంక్ తయారీ విధానం తెలుసు. రిటైర్మెంట్ లేదా అనుకోని కారణాలు ఏర్పడినప్పుడు మాత్రమే.. నమ్మకస్తులైన తర్వాతి ఉద్యోగులకు ఈ ఫార్ములాను బదిలీ చేస్తారు.
సిరా గుర్తు తొందరగా ఎందుకు చెరిగిపోదు!
ఈ సిరా తయారీకి సిల్వర్ నైట్రేట్ రసాయనాన్ని ఉపయోగిస్తారు. సిల్వర్ నైట్రేట్ ఈ సిరాను ప్రకృతిలో ఫొటోసెన్సిటివ్గా చేస్తుంది. దీని కారణంగా సూర్మరశ్మి తాకినప్పుడు ఈ సిరా ముదురు రంగులోకి మాత్రమే మారుతుంది. ఈ సిరా వేలిపై పూసినప్పుడు గోధుమ రంగులో ఉంటుంది. ఆ తర్వాత కొంత సమయానికి ముదురు ఊదా రంగులోకి.. ఆపై నల్లగా మారుతుంది. కాగా, ఈ సిరాలో వాడే సిల్వర్ నైట్రేట్.. మన శరీరంలోని ఉప్పుతో కలిసినప్పుడు అది సిల్వర్ క్లోరైడ్‌గా తయారవుతుంది. ఇది చర్మానికి అతుక్కుని ఉంటుంది. నీరు లేదా ఇతర రసాయనాల ద్వారా తొలగించలేకుండా తయారవుతుంది. చర్మ కణాలు పాతబడి.. మృతకణాలు ఒక్కొక్కటిగా రాలిపోయినప్పుడు మాత్రమే ఈ సిరా గుర్తు క్రమంగా అదృశ్యమవుతుంది.
25 దేశాలకు మన దగ్గరి నుంచే !
ఎన్నికల్లో ఉపయోగించే ఈ సిరాను కేవలం భారత్‌లో మాత్రమే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలు కూడా వాడుతున్నాయి. కెనడా, ఘనా, నైజీరియా, మంగోలియా, మలేసియా, నేపాల్, దక్షిణాఫ్రికా సహా 25కి పైగా దేశాలు మన సిరాను దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ విషయాన్ని ఎంపీవీఎల్ కంపెనీ ఎండీ ఇర్ఫాన్ వెల్లడించారు.
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
LuLu Mall | కూకట్పల్లి లూలూ మాల్లో దీపావళి షాపింగ్ సందడి షురూ.. బంపర్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు..!
పలు పంచాయతీల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ
బెల్టుషాపుల నియంత్రణకు నాగినేనిప్రోలు రెడ్డిపాలెం పంచాయతీ తీర్మానం
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

