Beauty tips | పదే పదే వచ్చే మొటిమలతో ఇబ్బంది పడుతున్నారా? మీ సమస్యకు ఇలా శాశ్వతంగా చెక్ పెట్టేయండి!
Beauty tips | అందానికి మొటిమలు ఓ అడ్డు! మొహంపై మొటిమలు అయ్యాయింటే.. ముఖం వికారంగా మారిపోయిందని చాలామంది అమ్మాయిలు బాధపడుతుంటారు. వాటిని తగ్గించుకోవడానికి మార్కెట్లో రకరకాల క్రీములను వాడుతుంటారు. ఆ క్రీముల్లో కొన్ని మంచి ప్రభావం చూపించవచ్చు
Beauty tips | అందానికి మొటిమలు ఓ అడ్డు! మొహంపై మొటిమలు అయ్యాయింటే.. ముఖం వికారంగా మారిపోయిందని చాలామంది అమ్మాయిలు బాధపడుతుంటారు. వాటిని తగ్గించుకోవడానికి మార్కెట్లో రకరకాల క్రీములను వాడుతుంటారు. ఆ క్రీముల్లో కొన్ని మంచి ప్రభావం చూపించవచ్చు. కానీ కొన్నిసార్లు అవి మొటిమలను మరింత ఎక్కువ చేసే అవకాశం కూడా ఉంది. అందుకే మొటిమలకు క్రీములు వాడటానికి బదులు.. అసలు మొటిమలు ఎందుకు వస్తున్నాయో కారణాలను తెలుసుకుంటే వాటిని తగ్గించుకోవడం చాలా ఈజీ అని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.
మొటిమలు ఎందుకు వస్తాయి? వాటిని ఎలా తగ్గించుకోవాలి?
☞ జిడ్డు చర్మం ఉన్నవారికి మొటిమలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రోజులో నాలుగైదుసార్లు చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఉదయం, సాయంత్రం రోజ్‌వాటర్‌తో ముఖం కడిగితే మొటిమల తీవ్రత తగ్గుతుంది.
☞ నూనె పదార్థాలను అధికంగా తినడం వల్ల కూడా మొటిమలు వచ్చే అవకాశం ఉంది. అందుకే రెగ్యులర్ డైట్లో నూనె శాతం తగ్గించాలి. సమతుల ఆహారం తీసుకోవాలి. నీళ్లు బాగా తాగాలి. పండ్ల రసాలు తీసుకోవాలి.
☞ డిప్రెషన్లో ఉన్నవారికి సైతం మొటిమలు వచ్చే అవకాశం ఉందని పలు పరిశోధనలు చెబుతున్నాయి. మానసికంగా సంతోషంగా ఉండాలి.
☞ ఆహారం విషయంలో సమయపాలన పాటించకపోవడం వల్ల కాలేయంలో ఉత్పత్తి అయ్యే యాసిడ్లు మొటిమలకు దారి తీస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే, సమయానికి తగు ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి.
☞ కొందరు మొటిమలను గిచ్చేస్తుంటారు. దీనివల్ల ఇన్ఫెక్షన్ పెరగడమే కాకుండా ఆ ప్రాంతంలో చర్మంపై గుంటలు ఏర్పడతాయి. మొటిమలు ఉన్న వాళ్లు టమాటా, నిమ్మ, నారింజ వంటి సిట్రస్ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయల ప్యాక్‌లు వేసుకోకూడదు.
☞ సాలిసిలిక్ ఆయిల్, టీట్రీ ఆయిల్ కలిగిన ఫేస్‌వాష్‌లను ఉపయోగించడం వల్ల మొటిమలు తగ్గుముఖం పడతాయి. కలబంద జెల్‌తో కస్తూరి కలిపి ఫేస్‌ప్యాక్‌గా వేసుకున్నా మొటిమలకు చెక్ పెట్టవచ్చు.
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

