అమరావతి : ఏపీలో జరిగిన ఎన్నికల సరళిని పరిశీలిస్తే టీడీపీకి 23 సీట్లు కూడా రావని మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) పేర్కొన్నారు. ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలింగ్ ప్రారంభం నుంచి రాత్రి వరకు మహిళలు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటుతో వైసీపీ(YCP) కి మద్దతు తెలిపిందని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాన్ గాలి బలంగా వీచిందని వెల్లడించారు. ల్యాండ్ యాక్ట్ (Land Act) పై టీడీపీ చేసిన ప్రచారాలను రైతులు నమ్మలేదన్నారు. పార్టీ అధ్యక్షుడి ఆదేశాల మేరకు పలు జిల్లాలో కూటమి దౌర్జన్యాలకు పాల్పడితే వైసీపీ సంయమనం పాటించిందని వివరించారు. ఓటమి భయంతో వైసీపీ మీద టీడీపీ దాడులకు తెగబడుతోందని ఆరోపించారు. విశాఖలో జగన్ (Jagan) సీఎంగా పండుగ లాంటి వాతావరణంలో ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. వైసీపీ విధానాలు నచ్చడంతో ప్రజలు పట్టం కడతారనే నమ్మకం వుందన్నారు.