Voter Slip | ఇంకా ఓటర్ స్లిప్ తీసుకోలేదా.. ఇలా మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోండి!
Voter Slip | ఎన్నికలప్పుడు ఓటర్ స్లిప్ తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే.. మీకు ఈ ఓటర్ స్లిప్ అందలేదా? అయితే టెన్షన్ పడాల్సిన అవసరమేమీ లేదు.. మీ చేతిలో ఉన్న మొబైల్ ద్వారానే ఓటర్ స్లిప్‌ను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Voter Slip | తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. మరికొద్ది గంటల్లో ఎన్నికల పోలింగ్ మొదలవ్వనుండటంతో హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రజలు సొంతూళ్లకు పయనమయ్యారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే చాలామంది తమ ఓటర్ స్లిప్‌లను కూడా అందుకున్నారు. మన పోలింగ్ సెంటర్ ఏంటి? ఆ స్టేషన్లో మన రూమ్ నంబర్, సీరియల్ నంబర్ ఎంత అనే వివరాలు ఈ ఓటర్ స్లిప్‌లో ఉంటాయి కాబట్టి ఓటు వేసేయడం చాలా సులభమవుతుంది. అందుకే ఎన్నికలప్పుడు ఓటర్ స్లిప్ తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే.. మీకు ఈ ఓటర్ స్లిప్ అందలేదా? అయితే టెన్షన్ పడాల్సిన అవసరమేమీ లేదు.. మీ చేతిలో ఉన్న మొబైల్ ద్వారానే ఓటర్ స్లిప్‌ను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
మొబైల్ బ్రౌజర్ ద్వారా..
కంప్యూటర్ లేదా మొబైల్ బ్రౌజర్ నుంచి ఓటర్ స్లిప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలంటే ముందుగా https://electoralsearch.eci.gov.in/ లింక్‌పై క్లిక్ చేయాలి. అక్కడ ఓటర్ స్లిప్ డౌన్లోడ్ చేసుకునేందుకు మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. ఓటర్ ఐడీ, మొబైల్ నంబర్ లేదా పేరు, ప్రాంతం వంటి వివరాలను ఎంటర్ చేయడం ద్వారా ఓటర్ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. పీడీఎఫ్ రూపంలో ఓటర్ స్లిప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా డౌన్లోడ్ చేసుకున్న ఓటర్ స్లిప్‌ను ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది.
మొబైల్ యాప్‌లో..
ఇక మొబైల్ యాప్ ద్వారా ఓటర్ స్లిప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే.. మీ ఆండ్రాయిడ్ లేదా యాపిల్ మొబైల్లో ఓటర్ హెల్ప్‌లైన్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో ఎలక్టోరల్ రోల్ సెర్చ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేయడం ద్వారా ఓటర్ స్లిప్ పొందవచ్చు. మొబైల్ నంబర్, ఓటర్ ఐడీతో పాటు పేరు, ఇతరత్రా వివరాలను ఎంటర్ చేయడం ద్వారా కూడా ఓటర్ స్లిప డౌన్లోడ్ చేసుకోవచ్చు.
మొబైల్ యాప్‌లో క్యూఆర్ కోడ్ ద్వారా కూడా ఓటర్ స్లిప్‌ను డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. మీ ఓటర్ ఐడీ పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ఓటర్ స్లిప్‌ను సులభంగా పొందవచ్చు. అలా వచ్చిన సమాచారాన్ని వాట్సాప్, మెయిల్ ద్వారా కూడా షేర్ చేసుకోవచ్చు.
మెసేజ్ ద్వారా కూడా..
మెసేజ్ రూపంలో ఓటర్ స్లిప్ పొందడానికి ECI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి.. ఓటర్ ఐడీ టైప్ చేసి 1950 నంబర్‌కు మెసేజ్ పంపించాలి. కాసేపటికే మీ పార్ట్ నంబర్, సీరియల్ నంబర్ వంటి సమాచారం మొబైల్‌కు మెసేజ్ రూపంలో వస్తుంది.
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

