Parenting | పిల్లల్లో అధిక బరువుకు కారణమేంటి?
మా బాబుకు పదేండ్లు. ఇంతకుముందు బరువు మామూలుగానే ఉండేవాడు. సంవత్సరం నుంచి ఊహించనంతగా బరువు పెరుగుతున్నాడు. నిరుడు సైకిల్ పైనుంచి పడ్డాడు. తలకు గాయమైంది. వైద్యులను సంప్రదిస్తే మెదడులో రక్తస్రావమైందని చెప్పారు. శస్త్రచికిత్స చేశారు.
Parenting | మా బాబుకు పదేండ్లు. ఇంతకుముందు బరువు మామూలుగానే ఉండేవాడు. సంవత్సరం నుంచి ఊహించనంతగా బరువు పెరుగుతున్నాడు. నిరుడు సైకిల్ పైనుంచి పడ్డాడు. తలకు గాయమైంది. వైద్యులను సంప్రదిస్తే మెదడులో రక్తస్రావమైందని చెప్పారు. శస్త్రచికిత్స చేశారు. అప్పట్నుంచి బరువు పెరుగుతున్నాడు. మా బాబుకు ఆటల పట్ల ఆసక్తి లేదు. ఎప్పుడూ ఏదో ఒకటి తింటూ ఉంటాడు. పిల్లల వైద్య నిపుణుడిని సంప్రదిస్తే ప్రవర్తనకు సంబంధించిన సమస్య కాబట్టి చిరుతిళ్లు తగ్గించమని సూచించారు. ఆహారం తగ్గించినా ప్రయోజనం లేదు. కొన్నాళ్లకు అదే తగ్గుతుందిలే అనుకున్నాం. అయితే, మా బిడ్డ బరువు పెరగడానికి హార్మోన్ల సమస్య కారణమేమో అన్న సందేహం కలుగుతున్నది. మా సమస్యకు సరైన పరిష్కారం చూపగలరు.
– ఓ పాఠకురాలు
ఒకే సంవత్సరంలో విపరీతమైన బరువు పెరిగాడని చెప్పారు. కానీ ఎంతన్నది చెప్పలేదు. వాస్తవానికి పిల్లలు ఒక ఏడాది కాలంలో ఒకటీ రెండు కిలోల కన్నా ఎక్కువగా పెరిగే అవకాశం లేదు. మీ బాబు మరీ ఎక్కువగా పెరిగినట్లు మీరు గమనించి ఉంటే, మళ్లీ ఓసారి ఇప్పుడు గ్రోత్ చాట్ సాయంతో అతని బరువుల్ని నమోదు చేయండి. పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్‌ను సంప్రదించి, ఈ బరువుకు బలమైన కారణం ఏమై ఉంటుందో నిర్ధారణ చేసుకోవాల్సి ఉంది. అలాగే మీ బాబు తలకు దెబ్బ తగిలిందని చెప్పారు.
ఒక్కోసారి తలకు గాయమైతే మెదడులోని గ్రంథులపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. మరో విషయం ఏమిటంటే.. ఈ రోజుల్లో పిల్లల్లో ఊబకాయం, స్థూలకాయం, ఒబేసిటీ వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఆరోగ్యకరమైనది కాకుండా ఎక్కువగా కొవ్వులు ఉన్న ఆహారం తీసుకోవడమే ఇందుకు కారణం. టీవీ, ఫోన్, ఇతర గ్యాడ్జెట్స్‌తో గడుపుతుండటమూ కారణమే. శారీరక శ్రమ లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం లాంటివి కూడా వింత ఆరోగ్య సమస్యలకు దారి తీస్తున్నాయి. అయితే మీ బాబుకి హార్మోన్ల లోపం ఉన్నదా.. లేదా? అనేది తెలుసుకునేందుకు కొన్ని పరీక్షలు అవసరం.
మీ బాబు సైక్లింగ్, స్విమ్మింగ్ వంటి ఔట్‌డోర్ గేమ్స్‌లో పాల్గొనేలా చూడండి. కొవ్వు పదార్థాలు లేని ఆహారం ఇవ్వండి. ఇంకో విషయం ఏమిటంటే మీ బాబులో మీరు గమనించిన కొన్ని లక్షణాల గురించి చెప్పలేదు. హుషారుగా ఉంటున్నాడా.. లేదా? మలబద్ధక సమస్య ఏమైనా ఉందా? నిస్సత్తువగా, నిద్రమత్తుగా ఉంటున్నాడా? గమనించండి. ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే థైరాయిడ్ లాంటి హార్మోన్ సమస్య ఉండొచ్చు. ఈ విషయాలన్నీ గ్రహించి, సమస్య పరిష్కారం కోసం పీడియాట్రిషన్‌ను లేదా పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఫలితం ఉంటుంది.
డాక్టర్ విజయానంద్
నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Obesity
- overweight
- parenting
- weight
RELATED ARTICLES
తాజా వార్తలు
South Carolina | అణు పరిశోధనా కేంద్రంలో అగ్నిప్రమాదం.. ఎమర్జెన్సీ ప్రకటించిన అధికారులు..!
Story competition | కథల పోటీలో ప్రతిభ చాటిన పావని
Sai Pallavi | ‘రావణుడు పూర్తిగా చెడ్డవాడు కాదు’.. సాయి పల్లవి వ్యాఖ్యలపై నెట్టింట దుమారం!
AP news | అర్నబ్ తుపానుతో అతలాకుతలం.. ఏపీలో నేడూ ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
Osmania University | ఓయూలో పెన్‌డౌన్.. సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగుల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

