BCCI : భారత జట్టుకు విశేష సేవలందించిన అసిస్టెంట్ కోచ్‌లు రియాన్ టెన్ డస్చేట్, టి.దిలీప్ కుమార్‌కు బీసీసీఐ (BCCI) ధన్యవాదాలు తెలిపింది. కాంట్రాక్ట్ ముగియడంతో ఈ ఇద్దరిని పొడిగించని భారత బోర్డు.. తదుపరి వారు చేపట్టబోయే బాధ్యతల్లో విజయవంతం కావాలని ఆకాంక్షించింది. శ్రీలంక పర్యటనకు టీమిండియా వెళ్లడంతో డస్చేట్, దిలీప్‌లకు కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టింది బీసీసీఐ.
టీమిండియాకు విశేష సేవలందించినందకు అసిస్టెంట్ కోచ్ రియాన్ డస్చేట్, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్‌లకు ధన్యవాదాలు. భారత జట్టు విజయాల్లో మీ ఇద్దరి అంకితభావం, వృత్తిపరమైన నైపుణ్యం, నిరంతర శ్రమ కీలక పాత్ర పోషించాయి. మీ ఇద్దరి కెరీర్ విజయవంతమవ్వాలని కోరుకుంటున్నాం అని ఎక్స్ పోస్ట్‌లో బీసీసీఐ వెల్లడించింది.
Thank you, Assistant Coach Ryan ten Doeschate and Fielding Coach T Dilip, for your invaluable contributions to #TeamIndia
Your dedication, professionalism and tireless efforts behind the scenes have played a big role in the team’s journey and success.
Wishing you both every… pic.twitter.com/9Y67dTHHO5
— BCCI (@BCCI) August 4, 2026
శ్రీలంక పర్యటనకు ముందే భారత జట్టు ఇద్దరు సహాయక కోచ్‌ల సేవలకు ఎండ్ కార్డ్ పడింది. ప్రధాన కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) ఏరికోరి తీసుకున్న రియాన్ టెన్ డస్చేట్ (Ryan ten Doeschate) వైదొలిగాడు. ఫీల్డింగ్ కోచ్‌గా సేవలందిస్తున్న టి.దిలీప్ (T.Dilip) కాంట్రాక్ట్ కూడా ముగిసింది. ఐర్లాండ్, ఇంగ్లండ్ చేతిలో వైట్‌వాష్ అనంతరం డస్కేట్ సమర్పించిన రాజీనామా లేఖను మంగళవారం భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆమోదించింది. అలానే దిలీప్‌ను కూడా సాగనంపింది బీసీసీఐ. దాంతో.. టీమిండియాతో వీరికుకున్న అనుబంధం ముగిసింది.