ఈ వారం రాశి ఫలాలు.. అక్టోబర్ 04. 10 .2026 నుంచి 10 .10. 2026 వరకు
అందరి ఆదరాభిమానాలతో సంతృప్తిగా ఉంటారు. ఉత్సాహంగా పనులు చేస్తారు. మంచి ఫలితాలు పొందుతారు. స్నేహితుల కారణంగా వృథా ఖర్చులు ఉంటాయి. ఆదాయం క్రమంగా పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.
మేషం
అందరి ఆదరాభిమానాలతో సంతృప్తిగా ఉంటారు. ఉత్సాహంగా పనులు చేస్తారు. మంచి ఫలితాలు పొందుతారు. స్నేహితుల కారణంగా వృథా ఖర్చులు ఉంటాయి. ఆదాయం క్రమంగా పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు మంచి వాతావరణం ఉంటుంది. అధికారుల అండదండలు లభిస్తాయి. ఆస్తి తగాదాలు కొంత వరకు పరిష్కారం అవుతాయి. భూ లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. శివాలయాన్ని సందర్శించండి.
వృషభం
పనిభారం పెరుగుతుంది. సమర్థంగా విధులు నిర్వర్తించి అధికారుల మన్ననలు పొందుతారు. ఆత్మీయుల సలహాలు పాటించండి. వ్యాపారులకు మంచి సమయం. భాగస్వాములతో సఖ్యత పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. నిర్మాణ పనులు వాయిదా వేసుకుంటే మంచిది. సమయ పాలన అవసరం. ఇష్టదైవాన్ని పూజించండి.
మిథునం
తలపెట్టిన పనులు నిర్ణీత సమయంలో పూర్తవుతాయి. సమాజంలో మంచిస్థితిలో ఉన్న వారితో స్నేహం ఏర్పడుతుంది. తద్వారా పనులు అనుకూలిస్తాయి. మంచి ఆలోచనలు చేస్తారు. చదువు, ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. అయితే సహోద్యోగులతో మనస్పర్ధలు తలెత్తవచ్చు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. రామాలయాన్ని సందర్శించండి.
కర్కాటకం
గతంతో పోలిస్తే ఈ వారం ఉన్నతంగా ఉంది. సమయానుకూల నిర్ణయాలతో సత్ఫలితాలు పొందుతారు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. స్థానచలన సూచన ఉంది. ఖర్చుల నియంత్రణ పాటించడం అవసరం. వారాంతంలో శుభవార్త వింటారు. ఆకస్మిక ధనలాభం ఉంది. ఇంటాబయటా సంతృప్తిగా ఉంటారు. రుణ బాధలు కొంత వరకు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. నరసింహస్వామి స్తోత్రాలు పఠించండి.
సింహం
తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తిచేస్తారు. డబ్బు చేతికి అందుతుంది. స్థిర, చరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు మంచి సమయం. వ్యాపార విస్తరణ చేయు ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో కదలిక ఉంటుంది. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. గృహనిర్మాణ పనులు ప్రారంభిస్తారు. దుర్గాదేవి ఆలయాన్ని దర్శించుకోండి.
కన్య
వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి. పారిశ్రామికవేత్తలు న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. భూముల కొనుగోలులో జాగ్రత్త అవసరం. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడం మంచిది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేపడతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన శుభప్రదం.
తుల
శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వివాదాలకు దూరంగా ఉంటారు. స్నేహితులతో పనులు నెరవేరుతాయి. అయితే ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. పై అధికారులతో స్నేహంగా ఉంటారు. కుటుంబ పెద్దల సహకారంతో పనులు పూర్తవుతాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. వినాయకుడి ఆలయాన్ని సందర్శించండి.
వృశ్చికం
రావలసిన డబ్బు అందుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. వ్యాపారులకు న్యాయపరమైన ఇక్కట్లు తొలగిపోతాయి. విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాలు సాధిస్తారు. బంధుమిత్రుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. పనులలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. ఆదాయంపై మనసు నిలుపుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. శివారాధనతో మేలు జరుగుతుంది.
ధనుస్సు
ఆదాయ మార్గాలపై మనసు నిలుపుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. అనవసరమైన ఖర్చులు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ పెద్దల సహకారంతో పనులు పూర్తవుతాయి. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. సంయమనం పాటించడం అవసరం. దత్తాత్రేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.
మకరం
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లలు చదువులో రాణిస్తారు. మంచి సంస్థలలో చేరే అవకాశం ఉంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కొత్త పరిచయాలతో కార్యసిద్ధి ఉంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల అదరణ లభిస్తుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. బంధువుల రాకతో ఖర్చులు పెరగవచ్చు. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.
కుంభం
ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. బరువు, బాధ్యతలు పెరుగుతాయి. ప్రయాణాల వల్ల అలసట కలుగుతుంది. అనవసరమైన ఆలోచనలతో ప్రశాంతత లోపిస్తుంది. బంధుమిత్రులతో స్నేహంగా ఉంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఉద్యోగులకు అధికారులతో పొసగకపోవచ్చు. సంయమనంతో పనులు చేసుకోవడం అవసరం. నలుగురిలో గుర్తింపు పొందుతారు. ఆదాయ మార్గాలపై మనసు నిలుపుతారు. శివాలయాన్ని సందర్శించండి.
మీనం
శుభకార్యాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. కళాకారులకు, సాహితీవేత్తలకు కొత్త అవకాశాలు వస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. విద్యార్థులకు అనుకూలం. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులు న్యాయ సమస్యలను అధిగమిస్తారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండండి. రామాలయాన్ని దర్శించుకోండి.
-గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల్ పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్. సెల్: 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బైక్ అదుపుతప్పి యువకుడు మృతి
Dhamma Parivartan Divas | ఆదిలాబాద్ జిల్లాలోని దళితవాడల్లో ఘనంగా దమ్మ పరివర్తన్ దివస్
Zumba | జుంబా, పైలేట్స్, హెచ్ఐఐటీ.. గుండెకు ఏ వ్యాయామం మంచిది?
‘పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం’
Jio IPO | జియో ప్లాట్ఫామ్స్ మెగా ఐపీవో.. నిమిషాల్లోనే పూర్తి సబ్స్క్రైబ్.. 3 రెట్లు బుక్ అయిన క్యూఐబీ
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

