Sitarama Project | సీతారామ కాలువ పనులను అడ్డుకున్న కమలాపురం రైతులు
Sitarama Project | సీతారామ ప్రాజెక్టు కాలువ నిర్మాణ పనులను ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కమలాపురం రైతులు ఆదివారం అడ్డుకున్నారు. భూసేకరణకు సంబంధించి 2021లో నిర్ణయించిన పరిహారం కాకుండా, ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
Sitarama Project | కారేపల్లి, నవంబర్ 22: సీతారామ ప్రాజెక్టు కాలువ నిర్మాణ పనులను ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కమలాపురం రైతులు ఆదివారం అడ్డుకున్నారు. భూసేకరణకు సంబంధించి 2021లో నిర్ణయించిన పరిహారం కాకుండా, ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రస్తుతం సాగులో ఉన్న వరి, పత్తి పంటలు చేతికొచ్చే వరకు కాలువ పనులు చేపట్టవద్దని పట్టుబట్టారు.
సీతారామ ప్రాజెక్టు కాలువ నిర్మాణం కోసం కమలాపురానికి చెందిన సుమారు 45 మంది రైతుల 54 ఎకరాల భూమిని 2021లో అధికారులు సేకరించి పరిహారం అవార్డు ప్రకటించారు. ఎకరానికి రూ.10.50 లక్షల చొప్పున పరిహారం నిర్ణయించినప్పటికీ, చాలాకాలం డబ్బులు అందకపోవడంతో రైతులు ఆ భూముల్లో సాగు కొనసాగించారు. ఈ ఏడాది ఆగస్టు 25న పరిహారం మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వారు తెలిపారు. అయితే, అప్పటికే భూముల్లో వరి, పత్తి పంటలు సాగు చేయగా ప్రస్తుతం అవి దిగుబడికి వచ్చాయి. ఈ సమయంలో కాలువ నిర్మాణానికి కాంట్రాక్టర్ జేసీబీ యంత్రాలను తీసుకురావడంతో రైతులు అడ్డుకున్నారు.
2021లో నిర్ణయించిన పరిహారం కాకుండా 2026 మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ఇదే ప్రాజెక్టు పరిధిలోని మరో మండల రైతులకు ఎకరానికి రూ.19.25 లక్షల పరిహారం ప్రకటించారని, తమకు మాత్రం తక్కువ మొత్తం చెల్లించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కూడా సమాన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంటలు పూర్తిగా కోసుకునే వరకు కాలువ నిర్మాణ పనులు నిలిపివేయాలని రైతులు స్పష్టం చేశారు. పంట చేతికొచ్చే దశలో పనులు చేపడితే తీవ్రంగా నష్టపోతామని పేర్కొన్నారు.
కోర్టు ఆదేశాలు రాలేదు.. పనులు చేపడతాం
భూముల పరిహారం విషయంలో రైతులు కోర్టును ఆశ్రయించారని నీటిపారుదల శాఖ ఏఈ సందీప్ తెలిపారు. 54 ఎకరాల భూమిని రెవెన్యూ శాఖ తమ శాఖకు అప్పగించిందని, ఈ ఏడాది ఆగస్టులో ప్రభుత్వం పరిహారం రైతుల ఖాతాల్లో జమ చేసిందని వివరించారు. పరిహారం సరిపోలేదని రైతులు కోర్టును ఆశ్రయించినప్పటికీ, తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదన్నారు. అందుకే కాలువ నిర్మాణ పనులు చేపట్టేందుకు సిద్ధమయ్యామని తెలిపారు. రైతులు సాగు చేసిన పంటలు పూర్తిగా చేతికొచ్చే వరకు ఖాళీగా ఉన్న భూముల్లో పనులు కొనసాగిస్తామని పేర్కొన్నారు. పనులను అడ్డుకునే అధికారం రైతులకు లేదని, యంత్రాలను నిలిపివేయడం వల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని అన్నారు. పరిహారం విషయంలో తమకు అన్యాయం జరిగిందని రైతులు ఆందోళన చేస్తుండగా, పనులు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. దీంతో కమలాపురంలో సీతారామ కాలువ భూసేకరణ వ్యవహారం ఉద్రిక్తంగా మారింది.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sitarama Project | సీతారామ కాలువ పనులను అడ్డుకున్న కమలాపురం రైతులు
Anupama Parameswaran | మహేష్ బాబు సినిమాలో విలన్గా నటించడానికైనా రెడీ.. అనుపమ పరమేశ్వరన్ కామెంట్స్ వైరల్!
Washington hair | అమెరికా తొలి అధ్యక్షుడి జట్టు వేలం.. మూడు వెంట్రుకల ధర 3.7 లక్షలు..!
Mysaa | రష్మిక మందన్న ‘మైసా’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న రావడం లేదని మేకర్స్ ప్రకటన!
Vijay and Sangeetha | అనిరుధ్, కావ్య గ్రాండ్ రిసెప్షన్.. వేర్వేరుగా వచ్చి జంటను ఆశీర్వదించిన సీఎం విజయ్, సంగీత!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

