Errabelli Dayakar Rao | ఈ పరిపాలన ఇక రాదు.. రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి : ఎర్రబెల్లి దయాకర్ రావు
Errabelli Dayakar Rao | ప్రజా సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, దాస్యం వినయ్ భాస్కర్ చలో వరంగల్ బీఆర్ఎస్ జన చైతన్య సభా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.
Errabelli Dayakar Rao | హన్మకొండ కేడీసీ గ్రౌండ్లో ఆదివారం సాయంత్రం 5 గంటలకు నిర్వహించననున్న చలో వరంగల్ బీఆర్ఎస్ జన చైతన్య సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారని తెలిసిందే. ఈ నేపథ్యంలో భారీ మొత్తంలో సభకు వచ్చే పార్టీ శ్రేణుల కోసం ఏర్పాట్లు చేశారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, దాస్యం వినయ్ భాస్కర్ సభా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. మీ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నరు.. మీ కార్యకర్తలు ఏం మాట్లాడుతున్నరు.. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు, నాయకులు అసంతృప్తితో ఉన్నారు. ఈ పరిపాలన ఇక రాదు.. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి చివరి ముఖ్యమంత్రి.. మళ్లీ రాబోయేది కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు.
ఈ సభా వేదికగా కేటీఆర్ మూడేళ్ల కాంగ్రెస్ సర్కార్ మోసాలు, వైఫల్యాలను పోరాటాల గడ్డ ఓరుగల్లు వేదికగా ఎండగట్టనున్నారు. ఈ సందర్బంగా ఇతర పార్టీల నాయకులతోపాటు వివిధ రంగాలకు చెందిన మేధావులు, పలువురు ప్రముఖులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరనున్నారు.
Read Also :
Ind vs Nz | వెల్లింగ్టన్ టెస్టులో భారత్ పరుగుల విధ్వంసం.. 9 వికెట్లు సాధిస్తే టీమిండియాదే గెలుపు
Suriya | ఒకే ఏడాదిలో మూడు సినిమాలతో రూ.200 కోట్ల క్లబ్.. ‘సీన్’ సక్సెస్‌పై సూర్య ఎమోషనల్ వీడియో!
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Errabelli Dayakar Rao | ఈ పరిపాలన ఇక రాదు.. రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి : ఎర్రబెల్లి దయాకర్ రావు
Sitarama Project | సీతారామ కాలువ పనులను అడ్డుకున్న కమలాపురం రైతులు
Anupama Parameswaran | మహేష్ బాబు సినిమాలో విలన్‌గా నటించడానికైనా రెడీ.. అనుపమ పరమేశ్వరన్ కామెంట్స్ వైరల్!
Washington hair | అమెరికా తొలి అధ్యక్షుడి జట్టు వేలం.. మూడు వెంట్రుకల ధర 3.7 లక్షలు..!
Mysaa | రష్మిక మందన్న ‘మైసా’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న రావడం లేదని మేకర్స్ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

