AP Jobs | ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court) సివిల్ జడ్జిల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. దీని ద్వారా 119 పోస్టులను నింపనుంది. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యింది. లా డిగ్రీ పూర్తిచేసినవారు అక్టోబర్ 26వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టు
సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్)- 119 ఖాళీలు
అర్హతలు
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు హైకోర్టు సర్వీస్, డిస్ట్రిక్ట్ జ్యూడీషియరీ, ప్రాసిక్యూషన్ సర్వీస్ లేదా సంబంధిత ఇతర ప్రభుత్వ శాఖల్లో ఖరారైన సభ్యుడిగా పనిచేస్తూ ఉండాలి.
సెప్టెంబర్ 1 నాటికి అభ్యర్థుల వయసు 35 ఏండ్లు దాటకూడదు. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీలకు 5, దివ్యాంగులకు 10, ఎక్స్ సర్వీస్మెన్లకు వారి సేవను బట్టి వయోపరిమితిలో సడలింపు ఉంది.

Posts
ఎంపిక
మూడు దశల్లో (స్క్రీనింగ్ టెస్ట్, రిటన్ ఎగ్జామ్, వైవా వోస్) ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
1) స్క్రీనింగ్ టెస్ట్ (Screening Test): దీనిలో 100 ప్రశ్నలు (మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ ప్రశ్నలు) 100 మార్కులకు ఉంటుంది. సమయం 2 గంటలు. దీనిలో సాధించిన మార్కుల ఆధారంగా 1:10 నిష్పత్తిలో రాత పరీక్షకు ఎంపిక చేస్తారు.
2) రాత పరీక్ష (Written Examination): దీనిలో మూడు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్ 100 మార్కులు, 3 గంటల సమయం చొప్పున నిర్వహిస్తారు. పేపర్-1 సివిల్ లాస్, పేపర్-2 క్రిమినల్ లాస్, పేపర్-3 ఇంగ్లిష్ (ట్రాన్స్లేషన్ అండ్ ఎస్సే రైటింగ్).
3) వైవా వోస్ (Viva Voce): దీనికి రిటన్ ఎగ్జామ్లో అర్హత సాధించిన వారిని 1:3 నిష్పత్తిలో పిలుస్తారు. మార్కులు 50.
జీతం
ఎంపికైనవారికి నెలకు రూ. 77,840 నుంచి రూ. 1,36,520 వరకు ఉంటుంది.
ఫీజు
దరఖాస్తు ఫీజు రూ. రూ. 1500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. 750
చివరితేదీ
దరఖాస్తు ప్రక్రియ మొదలయ్యింది. అక్టోబర్ 26వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు, ఇతర వివరాలకు వెబ్సైట్ aphc.gov.in చూడండి.

Civil Judge