భువీ వచ్చేశాడు.. నాలుగేండ్ల తర్వాత భారత జట్టులో రీఎంట్రీ
వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ నాలుగేండ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మళ్లీ భారత జట్టులోకి వచ్చాడు.
- న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు టీమ్ ప్రకటన
న్యూఢిల్లీ: ఈ నెల 22 నుంచి జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్‌లో పర్యటించే జట్టులో అతను చోటు దక్కించుకున్నాడు. 36 ఏండ్ల భువీ గత ఐపీఎల్లో 17 వికెట్లు తీసి ఆర్సీబీ వరుసగా రెండోసారి టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. పవర్‌ప్లేలో స్వింగ్, సీమ్ కదలికలతో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టే సత్తా ఉన్న భువీని అజిత్ అగార్కర్ చీఫ్‌గా సెలెక్టర్‌గా ఉన్నంతకాలం ఎంపిక చేయడానికి మొగ్గు చూపలేదు. అయితే అగార్కర్ తప్పుకోవడంతో అతనికి మార్గం సుగమం అయింది.
ఈ సిరీస్‌కు రెస్ట్ తీసుకుంటున్న పేస్ లీడర్ బుమ్రా లేని లోటును భువనేశ్వర్ తన అనుభవంతో పూడ్చనున్నాడు. భువీ 2022 నవంబర్‌లో భారత్ తరఫున తన చివరి మ్యాచ్ ఆడాడు. మరోవైపు గాయం కారణంగా ఆసియా క్రీడలకు దూరమైన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని జట్టులో తిరిగి చోటు దక్కించుకున్నాడు. ఈ సిరీస్‌లో ఐదు టీ20లు ఈ నెల 22, 24, 27, 30, నవంబర్ 1వ తేదీల్లో జరుగుతాయి.
జట్టు: శ్రేయస్ (కెప్టెన్), తిలక్, అభిషేక్, శాంసన్ (కీపర్), సూర్యవంశీ, ఇషాన్ (కీపర్), అక్షర్, దూబే, నితీశ్ రెడ్డి, నమన్ ధీర్, ప్రిన్స్, మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్, భువనేశ్వర్, చక్రవర్తి, కుల్దీప్.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

