అవమానకర వ్యాఖ్యలపై ఐక్య పోరాటం
తెలంగాణ మహిళా కళాకారులు, కవులు, జర్నలిస్టుల మీద సోషల్ మీడియాలో వస్తున్న అవమానకర వ్యాఖ్యలపై ఐక్యంగా పోరాడాలని సోమవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు తీర్మానించారు. తెలంగాణ మహిళా కళాకారులపై అసభ్య, అమానుష దాడిని తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
- పథకం ప్రకారం మహిళాకవులు, జర్నలిస్టులు,కళాకారులపై దాడి
- మద్దతునిస్తున్నవారినీ శిక్షించాలి
- ’రౌండ్‌టేబుల్’లో వక్తలు
ఖైరతాబాద్, నవంబర్ 16 : తెలంగాణ మహిళా కళాకారులు, కవులు, జర్నలిస్టుల మీద సోషల్ మీడియాలో వస్తున్న అవమానకర వ్యాఖ్యలపై ఐక్యంగా పోరాడాలని సోమవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు తీర్మానించారు. తెలంగాణ మహిళా కళాకారులపై అసభ్య, అమానుష దాడిని తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. గాయకుడు సందీప్ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో రచయిత్రి శ్యామల, కోదాడ శ్రీనివాస్, సురేఖ, బాలు, వాణి, శివారెడ్డి, సరిత, శంకర్, రమణకుమార్ మాట్లాడారు. భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో కొందరు మహిళా కవులు, కళాకారులు, పాత్రికేయులపై తీవ్ర పదజాలంతో రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. శివజ్యోతి, మధుప్రియతోపాటు ఇతర మహిళలపై రాజ్బోడ వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. సోషల్ మీడియాలో రాజకీయ నాయకులు, పాత్రికేయులు, కవులు, కళాకారులపై ఆధారరహిత విమర్శలు, వ్యక్తిగత దూషణలు పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం అని పేర్కొన్నారు.
సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను వెలికి తీసి వాటి పరిష్కారానికి ప్రయత్నించే పాత్రికేయులు ముఖ్యంగా మహిళా జర్నలిస్టులపై సోషల్ మీడియా వేదికగా దూషణలు చేయడం వారిని తీవ్ర మానసిక వేదనకు గురిచేస్తుందని అన్నారు. రాజ్బోడ లాంటి వ్యక్తులు ఎవరి అండదండలతో చెలరేగిపోతున్నారో వారిని సైతం గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ విషయంలో వ్యవహరిస్తున్న తీరు తీవ్ర అభ్యంతరకరమని అన్నారు. మహిళల గౌరవాన్ని కించపరిచేలా దూషిస్తున్నవారిపట్ల మహిళా కమిషన్ చర్యలకు ఉపక్రమించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. గతంలో ఇటువంటి వీడియోలపై విచారణ జరిపి తొలగించేలా ఆదేశాలు జారీచేసిన కమిషన్ ప్రస్తుతం ఎందుకు మిన్నకుంటున్నదని నిలదీశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మహిళలు, పాత్రికేయులపై విచక్షణారహితంగా రెచ్చిపోతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యవహరిస్తున్న వ్యక్తులపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు పెద్ద ఎత్తున సంతకాల సేకరణ చేసి ప్రభుత్వానికి సమస్య తీవ్రత అర్థమయ్యేలా చేయాలని తీర్మానించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

