భోజనం బాగాలేదని రోడ్డెక్కిన ఓయూ విద్యార్థినులు
ఉస్మానియా యూనివర్సిటీలో తమకు అందిస్తున్న భోజనం నాణ్యంగా లేదంటూ విద్యార్థినులు రోడ్డెక్కారు. లేడీస్ హాస్టల్లో భోజనం సరిగా లేదంటూ ఇప్పటికే పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ భోజనానికి సంబంధించిన గిన్నెలు, అన్నం, కూరలతో సహా రోడ్డుపై బైఠాయించారు.ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు మాట్లాడుతూ..అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా యూనివర్సిటీలో తమకు అందిస్తున్న భోజనం నాణ్యంగా లేదంటూ విద్యార్థినులు రోడ్డెక్కారు. లేడీస్ హాస్టల్లో భోజనం సరిగా లేదంటూ ఇప్పటికే పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ భోజనానికి సంబంధించిన గిన్నెలు, అన్నం, కూరలతో సహా రోడ్డుపై బైఠాయించారు.ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు మాట్లాడుతూ..అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు వచ్చి తమ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చే వరకు అక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అన్నంలో పురుగులు వస్తున్నాయని చెప్పినా కనీసం స్పందించడం లేదని మండిపడ్డారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

