PM Modi: ప్రభుత్వాధిపతిగా 25 ఏళ్లు.. వినాయకుడి గుడిలో ప్రధాని మోదీ పూజలు
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాసేవలో కీలక ఘట్టం చోటుచేసుకున్నాయి. ప్రభుత్వాధిపతిగా ఆయన 25 ఏళ్లు గడిపారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలోని సరోజినినగర్‌లో ఉన్న శ్రీ వినాయక్ మందిర్‌లో ఆయన ప్రత్యేక పూజలు, అర్చన చేశారు.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ప్రజాసేవలో కీలక ఘట్టం చోటుచేసుకున్నాయి. ప్రభుత్వాధిపతిగా ఆయన 25 ఏళ్లు గడిపారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలోని సరోజినినగర్‌లో ఉన్న శ్రీ వినాయక్ మందిర్‌లో ఆయన ప్రత్యేక పూజలు, అర్చన చేశారు. మరింత దీక్షతో దేశానికి సేవ చేయాలన్న సంకల్ప ప్రతిజ్ఞ చేశారు. ప్రభుత్వాధిపతిగా గత 25 ఏళ్ల నుంచి మోదీ కొనసాగుతున్నారు. తొలుత గుజరాత్‌కు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ఆ తర్వాత వరుసగా మూడు లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన ఆయన దేశ ప్రధానిగా కొనసాగుతున్నారు. 2001, అక్టోబర్ 7 నుంచి ఆయన ప్రభుత్వ అధిపతిగానే కొనసాగుతున్నారు.
ఈ నేపథ్యంలో విఘ్నహరుడు వినాయకుడికి ఆయన ఇవాళ ఢిల్లీలో పూజలు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న తన కుటుంబ సభ్యులకు సంతోషాన్ని, సౌభాగ్యాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆ గణేశుడిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. తన ఎక్స్ అకౌంట్లో హిందీలో ఆయన ఓ పోస్టు చేశారు. ప్రతి ఒక్కరిపై వినాయకుడి ఆశీస్సులు ఉండాలని, ప్రగతి బాటలో దేశం ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
आज नई दिल्ली के श्री विनायक मंदिर में पूजा-अर्चना की।
भगवान श्री गणेश से देशभर के अपने परिवारजनों की सुख-समृद्धि और उत्तम स्वास्थ्य की कामना की।
विघ्नहर्ता की कृपा से सबका कल्याण हो और देश निरंतर प्रगति के मार्ग पर आगे बढ़ता रहे। https://t.co/ZPADyotAFk
— Narendra Modi (@narendramodi) October 7, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

