Jobs | ది సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (C-DAC) కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MeitY) ఆధ్వర్యంలో పనిచేసే శాస్త్రీయ సంస్థ (Scientific Society). సీడాక్ 842 ప్రాజెక్ట్ స్టాఫ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిని సీడాక్ సెంటర్లైన ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, నోయిడా, పుణె, ముంబై, మొహాలి, కోల్కతా, తిరువనంతపురాల్లో నింపనుంది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అక్టోబర్ 26వ తేదీతో ముగియనుంది.
ఖాళీల వివరాలు
హైదరాబాద్- 46
నోయిడా- 207
పుణె- 142
తిరువనంతపురం- 118
గువాహటి- 88
చెన్నై- 88
బెంగళూరు- 58
మొహాలి- 55
ముంబై- 20
కోల్కతా- 19
ఢిల్లీ- 1

Posts
పోస్టులు
ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ ఇంజినీర్, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్/మాడ్యూల్ లీడ్, ప్రాజెక్ట్ మేనేజర్/ప్రోగ్రామ్ మేనేజర్, టెక్ లీడ్, ప్లస్ సపోర్ట్ రోల్స్ (HR/Admin, Finance, Purchase, Technician).
అర్హతలు
పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, SCVT/ITI సర్టిఫికెట్, డిగ్రీ, ఎంఈ, ఎంటెక్, సీఏ, ఎల్ఎల్ఎం, సీఎస్, సీఎంఏ, ఎంబీఏ, పీజీ, ఎల్ఎల్బీ, పీహెచ్డీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు, పని అనుభవం
ప్రాజెక్ట్ అసోసియేట్లకు 30 నుంచి 45 ఏండ్లు, అనుభవం అవసరం లేదు. ప్రాజెక్ట్ ఇంజినీర్లకు 30 నుంచి 45 ఏండ్లు, 0-4 ఏండ్ల పని అనుభవం ఉండాలి. సీనీయర్ ప్రాజెక్ట్ ఇంజినీర్/ప్రాజెక్ట్ లీడ్/మాడ్యూల్ లీడ్లకు 40 ఏండ్లలోపు, 4-7 ఏండ్ల పని అనుభవం ఉండాలి. ప్రాజెక్ట్/ప్రోగ్రామ్ మేనేజర్/నాలెడ్జ్ పార్టానర్లకు 56 ఏండ్లలోపు, 9-15 ఏండ్ల పని అనుభవం ఉండాలి.
ఎంపిక
రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
జీతం
ఎంపికైనవారికి నెలకు ప్రాజెక్ట్ అసోసియేట్లకు రూ. 30,000 నుంచి రూ. 42,000, ప్రాజెక్ట్ మేనేజర్లకు రూ. 37,416 నుంచి రూ. 59,250, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్లకు రూ. 70,750 నుంచి రూ. 1,16,667, ప్రాజెక్ట్ మేనేజర్లకు రూ. 1,05,250 నుంచి రూ. 1,90,833.
చివరితేదీ
ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అక్టోబర్ 26వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఇతర వివరాలకు వెబ్సైట్ careers.cdac.in చూడండి.

Job