Erravelli Lands | ఎర్రవల్లి అసైన్డ్ భూమిని అర్హులకు పంచండి.. సర్వే నంబర్-325 భూములపై సీఎం రేవంత్ ఆదేశం
Erravalli Lands | ఎర్రవల్లి గ్రామ పరిధిలోని 325 సర్వే నంబర్లోని అసైన్డ్ భూమిని అర్హులైన రైతులకు పంపిణీ చేయాలని, ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
Erravelli Lands | హైదరాబాద్, అక్టోబర్ 6(నమస్తే తెలంగాణ) : ఎర్రవల్లి గ్రామ పరిధిలోని 325 సర్వే నంబర్లోని అసైన్డ్ భూమిని అర్హులైన రైతులకు పంపిణీ చేయాలని, ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన సిద్దిపేట జిల్లా మరూక్ మండలం ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల భూముల అంశంపై సమీక్ష నిర్వహించారు. ఇటీవల రెండు గ్రామాల్లో నిర్వహించిన సర్వే వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. ఎర్రవల్లి గ్రామ పరిధిలో సర్వే నంబర్ 325లో మొత్తం 388 ఎకరాల భూమికి గాను, రెవెన్యూ అధికారుల సర్వేలో 343 ఎకరాలు ఉన్నట్టు గుర్తించారని అధికారులు తెలిపారు. మిగిలిన 45 ఎకరాలు ఎకడున్నదో తేల్చాలని అధికారులను సీఎం ఆదేశించారు. భూమి గు ర్తింపు కోసం ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల్లో సర్వే కోసం నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆదేశించారు.
భూమి సరిహద్దులో ఉన్న మాజీ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు రెవెన్యూ రికార్డులు సబ్మిట్ చేయాలని కోరుతూ నోటీసులు జారీ చేయాలని అ ధికారులను సీఎం ఆదేశించారు. లెక్కలోకి రాని 45 ఎకరాల భూమి కొండపోచమ్మ కా లువతోపాటు రోడ్డుకు, పాండురంగ చెరువుతోపాటు మరో చెరువు అభివృద్ధిలో పోయిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించినట్టు తెలిసింది. గతంలో ఆ భూమిని పంపిణీ చేసిన సమయంలో ఆ భూమి మొత్తం గుట్ట లు, రాళ్లతో ఉండటంతో కొలతలు సరిగ్గా లేవ ని, ఇప్పుడు చదువును కావడంతో భూమి తగ్గడం సహజమేనని అధికారులు చెప్పినట్టు తెలిసింది. ఇదే విషయాన్ని సర్వే సమయం లో గ్రామస్తులు, ఆ భూముల రైతులు సైతం వెల్లడించారు. అవన్నీ మీకెందుకని, కేసీఆర్ కుటుంబానికి నోటీసులు ఇవ్వాలని సీఎం హుకుం జారీ చేసినట్టు తెలిసింది. ‘నోటీసులు ఇవ్వడానికి మీకేం బాధ? వాళ్లే సమాధానం చెప్పుకొంటారు’ అంటూ ఆదేశించినట్టు తెలిసింది. ఈ భూమిని అర్హులైన రైతులకు పంపిణీ చేయాలని ఆదేశించడంతో పాటు సర్వే నంబర్ 325లో తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాల కోసం తెలంగాణ అమరవీరుల కాలనీ నిర్మాణం చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించడం గమనార్హం.
తెలంగాణ అమరవీరుల కాలనీలో అమరవీరుల కుటుంబాలకు ఇండ్ల స్థలాలు కేటాయించి, సకల సౌకర్యాలతో కా లనీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కాల నీ నిర్మాణ బాధ్యతలను హౌసింగ్ శాఖకు అప్పగించాలని, జూన్ 2లోగా అమరవీరుల కాలనీ నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించా రు. ఇప్పటికే ఆ భూమి స్థానిక రైతుల పేరిటనే ఉన్నదని, మళ్లీ ఆ రైతులకు పంపిణీ చేయడం ఏమిటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. రైతు ల ఆధీనంలో ఉన్నటువంటి భూమిని అమరవీరుల కుటుంబాలకు ఎలా పంపిణీ చేస్తారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అప్పుడు తమ పరిస్థితి ఏందని రైతులు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా ఒకేసారి ఇటు రైతులకు భూమి పంపిణీ చేస్తామని, మరోవైపు అమరవీరుల కుటుంబాలకు కోసం ఇండ్ల స్థలాలు కేటాయించి కాలనీ నిర్మిస్తామని చెప్పడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకే భూమిలో రెండు ఎలా సాధ్యమవుతాయని, ఇలా విరుద్ధ ప్రకటనలు చేయడం వెనుక ఉద్దేశం ఏందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

