న్యూఢ్లిలీ : ఏఐ మనుషులతో సంభాషించడం చూసే ఉంటారు. అయితే ఇటీవల నిర్వహించిన ఓ ప్రయోగంలో ఏఐ ఏజెంట్లు ఒకరితో ఒకరు సంభాషించుకునే క్రమంలో తమకంటూ ఓ రహస్య భాషను అభివృద్ధి చేసుకున్నాయి. క్లాడ్, జెమిని, ఓపెన్ ఏఐకి చెందిన ఏజెంట్లకు ఓ పని అప్పగించారు. పరస్పరం సంభాషించేటప్పుడు అవి పదాల అర్థాలను మార్చుకుని పూర్తిగా కొత్త భాషలో మాట్లాడటం ప్రారంభించాయి.
ఏఐ ఏజెంట్లకు కొత్త భాషను సృష్టించమని ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. అయినప్పటికీ, అవి తమ సొంత సంక్షిప్త రూపాలను అభివృద్ధి చేసుకున్నాయి. మనుషులు ఏఐ రాసినదాన్ని చదవగలిగినా, ఆ పదాల అర్థాన్ని తెలుసుకోవడం కష్టంగా మారింది. ఏఐ స్టార్టప్ ఎమర్జెన్స్కు చెందిన శాస్త్రవేత్తల ప్రకారం, ఏఐ ఏజెంట్ల సంభాషణను చూడగలగడం మాత్రమే సరిపోదు. అవి ఒకదానితో ఒకటి ఎలా సంభాషించుకుంటున్నాయి, అర్థం ఏమిటో తెలుసుకోవడం నిజంగా సవాలే అని పేర్కొన్నారు.