UPSC | యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)ను లీ కమిషన్ (1924) సిఫారసుల ప్రకారం 1926, అక్టోబర్ 1న ఏర్పాటు చేశారు. దీనికి తొలి చైర్మన్‌గా రాస్ బార్కర్ వ్యవహరించారు. నేటి (2026, అక్టోబర్ 1)తో వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం శతాబ్ది ఉత్సవాలు నిర్వహించింది.
ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం 1937లో దీన్ని ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌గా పేరు మార్చారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తరువాత 1956, జనవరి 26న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌గా మార్చారు. భారత రాజ్యాంగంలోని 14వ భాగంలో ఆర్టికల్ 315 నుంచి 323 వరకు యూపీఎస్సీ అధికారాలు, నిబంధననలను పొందుపరిచారు.
యూపీఎస్సీ శతాబ్ది వేడుకలను ఢిల్లీలోని భారత్ మండప్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రత్యేక తపాలా బిళ్ల (Postal Stamp), స్మారక నాణేన్ని విడుదల చేశారు. అదేవిధంగా ‘100 Landmark Judgements – Shaping the Policies of UPSC and Public Service Commissions in India’ అనే పుస్తకాన్ని విడుదల చేశారు.