Jailer 2 | ‘జైలర్ 2’ నుంచి ఏకంగా 100 నిమిషాల ఫుటేజ్ కట్ చేశారా .. షాకింగ్ న్యూస్ వైరల్!
Jailer 2 | సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులతో పాటు సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రేజీ సీక్వెల్స్‌లో ‘జైలర్ 2’ కూడా ఒకటి. రజనీకాంత్–నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు కూడా మంచి స్పందన లభించింది.
Jailer 2 | సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులతో పాటు సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రేజీ సీక్వెల్స్‌లో ‘జైలర్ 2’ కూడా ఒకటి. రజనీకాంత్–నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు కూడా మంచి స్పందన లభించింది. తాజాగా ఈ సినిమాకు సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయని, రన్‌టైమ్ కూడా ఖరారైనట్లు వార్తలు వచ్చాయి.అయితే ఇప్పుడు ‘జైలర్ 2’ రన్టైమ్కు సంబంధించి ఓ ఆసక్తికరమైన ప్రచారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదేంటంటే.. ఈ సినిమా కోసం చిత్రీకరించిన ఫుటేజ్‌లో ఏకంగా 100 నిమిషాల సన్నివేశాలను తొలగించినట్లు టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం ‘జైలర్ 2’ ఒరిజినల్ ఫుటేజ్ దాదాపు 2 గంటల 45 నిమిషాల నిడివి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఫైనల్ ఎడిటింగ్‌లో భాగంగా భారీగా సన్నివేశాలను తొలగించినట్లు ప్రచారం జరుగుతోంది. సుమారు 100 నిమిషాల ఫుటేజ్‌ను కట్ చేసి, మిగిలిన కంటెంట్‌తోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారనే వార్త ఇప్పుడు అభిమానుల్లో చర్చకు దారితీసింది. అయితే సినిమా ఎడిటింగ్‌లో అవసరం లేని సన్నివేశాలను తొలగించడం సాధారణమే. కథనం వేగంగా సాగేందుకు, ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా ఉండేందుకు దర్శకులు, ఎడిటర్లు కొన్ని సన్నివేశాలను కట్ చేస్తుంటారు. కానీ ‘జైలర్ 2’ విషయంలో ఏకంగా 100 నిమిషాల ఫుటేజ్ తొలగించారనే ప్రచారం మాత్రం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
సాధారణంగా ఒక సినిమా నుంచి కొన్ని సన్నివేశాలు, పాటలు లేదా అవసరం లేని భాగాలను తొలగించడం జరుగుతుంది. కానీ ఏకంగా గంటన్నరకు పైగా ఫుటేజ్‌ను కట్ చేశారనే వార్త మాత్రం చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. దీంతో అసలు ‘జైలర్ 2’లో ఎంత కంటెంట్‌ను చిత్రీకరించారు? అందులో ఏ కారణంతో ఇంత భారీ మొత్తంలో ఫుటేజ్‌ను తొలగించారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ ఈ ప్రచారంలో నిజం ఉంటే.. సినిమాలో కథకు సంబంధం లేని సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయా? లేదా రన్‌టైమ్‌ను తగ్గించి మరింత గ్రిప్పింగ్‌గా సినిమాను అందించాలనే ఉద్దేశంతో దర్శకుడు నెల్సన్ ఈ నిర్ణయం తీసుకున్నారా? అనేది తెలియాల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anant Singh | బహిష్కృత జేడీ(యూ) ఎమ్మెల్యే అనంత్ సింగ్‌కు సుప్రీంకోర్టులో నిరాశ.. డిసెంబర్ 1 లోగా లొంగిపోవాలని ఆదేశం
Cult Review | ‘కల్ట్’ సినిమా రివ్యూ.. విశ్వక్సేన్ కొత్త సినిమా ఎలా ఉందంటే!
Inter Student | అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
Rise | రూ.100 చేరువలో కిలో బియ్యం..! సామాన్య ప్రజల రక్తం తాగుతున్న రైస్ మాఫియా
Soil Fertility | భూసారాన్ని కాపాడితేనే భవిష్యత్ ..వ్యవసాయానికి భరోసా
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

