అమరావతి : ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్‌పై దాడికి పాల్పడిన సంఘటన ఏపీలోని పల్నాడు జిల్లా గురజాలలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..మాచర్ల వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఓ మహిళ మాడుగుల అడ్డరోడ్డు వద్ద ఆపాలని కోరింది. అయితే బస్సు డ్రైవర్ అక్కడ కాకుండా ముందుకెళ్లి బస్సు ఆపాడు.
సదరు డ్రైవర్, కండక్టర్ డ్యూటీ మారగా బస్సు తిరుగు ప్రయాణంలో మహిళ, ఆమె కుటుంబ సభ్యులు బైక్‌లతో బస్సును అడ్డుకున్నారు. డ్రైవర్, కండక్టర్‌పై కోడి గుడ్లతో దాడికి పాల్పడ్డారు. కండక్టర్ సోమయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.