Jobs | అస్సాం రైఫిల్స్ (Assam Rifles) టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్ ఖాళీల భర్తీకి రిక్రూట్మెంట్ ర్యాలీ 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా 354 గ్రూప్ సి పోస్టులను నింపనుంది. అర్హులైన వారు దరఖాస్తు చేసుకుని రిక్రూట్మెంట్ ర్యాలీకి హాజరు కావాలి. అక్టోబర్ 28 వరకు దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టులవారీగా ఖాళీలు
వారంట్ ఆఫీసర్- 129
హవల్దార్- 6
రైఫిల్‌మ్యాన్- 219
విభాగాలవారీగా..
వారంట్ ఆఫీసర్- 124
రైఫిల్‌మ్యాన్ (ఎలక్ట్రికల్ ఫిట్టర్ సిగ్నల్)- 32
రైఫిల్‌మ్యాన్ (లైన్‌మ్యాన్ ఫీల్డ్)- 21
రైఫిల్‌మ్యాన్ (ఆర్మరర్)- 29
రైఫిల్‌మ్యాన్ (ఇంజినీర్ ఎక్విప్మెంట్ మెకానిక్)- 10
రైఫిల్‌మ్యాన్ (రికవరీ వెహికల్ మెకానిక్)- 13
రైఫిల్‌మ్యాన్ (ఎలక్ట్రీషియన్ మోటార్ వెహికల్)- 22
హవల్దార్ (ఇన్స్ట్రుమెంట్ మెకానిక్)- 6
రైఫిల్‌మ్యాన్ (మెటల్స్మిత్)- 19
రైఫిల్‌మ్యాన్ (Upholster)- 3
రైఫిల్‌మ్యాన్ స్టోర్ కీపర్ టెక్నికల్ (ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజినీర్)- 16
రైఫిల్‌మ్యాన్ (వెహికల్ మెకానిక్)- 23
రైఫిల్‌మ్యాన్ (వెల్డర్)- 2
వారంట్ ఆఫీసర్ (డ్రాఫ్ట్స్‌మ్యాన్)- 2
వారంట్ ఆఫీసర్ (ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్)- 1
వారంట్ ఆఫీసర్ (ఫిజియోథెరపిస్ట్)- 2
రైఫిల్‌మ్యాన్ (మాసన్)- 29

Assam Rifles Posts
అర్హతలు
గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి లేదా మెట్రిక్యులేషన్ లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లేదా ఇన్స్ట్రుమెంట్ ఇంజినీరింగ్ టెక్నాలజీ, ఫిజియోథెరపీలో కనీసం రెండేండ్ల డిప్లొమా, ఐటీఐలో ఉత్తీర్ణత సాధించాలి.
అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏండ్లలోపు ఉండాలి. ఓబీసలకు 3, ఎస్సీ, ఎస్టీలకు 5 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక
డాక్యమెంట్ వెరిఫికేషన్, కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ టెస్ట్‌లు నిర్వహిస్తారు. వీటిలో సాధించిన ఫలితాలను బట్టి రూపొందించిన మెరిట్ లిస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
జీతం
రైఫిల్‌మ్యాన్ (లెవల్ 3)లకు రూ. 21,700 నుంచి 69,100 వరకు, హవిల్దార్ (హవల్దార్) (లెవల్ 4)లకు రూ. 25,500 నుంచి 81,100 వరకు ఉంటుంది.
ఫీజు
దరఖాస్తు ఫీజు రూ. 100. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళలకు ఫీజు లేదు.
చివరితేదీ
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యింది. అక్టోబర్ 28వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. రిక్రూట్మెంట్ ర్యాలీ నవంబర్ 23 నుంచి నిర్వహిస్తారని అంచనా. దరఖాస్తు, ఇతర వివరాలకు వెబ్సైట్ www.assamrifles.gov.inలో చూడండి.

Job