Thaman | థమన్ ట్వీట్‌తో ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ డేట్ లీక్.. ఆ తేదీన పక్కా వస్తుందా?
Thaman | విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం’ విడుదలపై ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. నిజానికి ఈ సినిమా అక్టోబర్ 9న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తికాకపోవడంతో సినిమా విడుదల వాయిదా పడింది.
Thaman | విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం’ విడుదలపై ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. నిజానికి ఈ సినిమా అక్టోబర్ 9న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తికాకపోవడంతో సినిమా విడుదల వాయిదా పడింది. కొత్త విడుదల తేదీని నిర్మాత నాగవంశీ అధికారికంగా ప్రకటించలేదు. ఇలాంటి సమయంలో సంగీత దర్శకుడు థమన్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు సినిమాకు సంబంధించిన కొత్త రిలీజ్ డేట్‌పై ఆసక్తిని పెంచింది. ‘ఆదర్శ కుటుంబం’ రీ-రికార్డింగ్ పనులకు సంబంధించిన అప్డేట్ను థమన్ తాజాగా తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన పోస్టులో పొరపాటున అక్టోబర్ 30, 2026 అనే విడుదల తేదీ ప్రస్తావనకు తెచ్చారు. ఆ తర్వాత థమన్ తన పోస్టును ఎడిట్ చేసి ఆ తేదీని తొలగించారు.
అయితే అప్పటికే ఆయన చేసిన అసలు పోస్టుకు సంబంధించిన ఎడిట్ వివరాలు సోషల్ మీడియాలో చర్చకు రావడంతో అక్టోబర్ 30న ‘ఆదర్శ కుటుంబం’ విడుదల కానుందనే వార్తలు వైరల్‌గా మారాయి. థమన్ పొరపాటున కొత్త రిలీజ్ డేట్‌ను వెల్లడించారా? లేక ఆ తేదీని పరిశీలిస్తున్నారా? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అక్టోబర్ 30, 2026 శుక్రవారం కావడంతో అదే రోజున సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయనే అంచనాలు మొదలయ్యాయి. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. నిర్మాత నాగవంశీ లేదా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నుంచి కొత్త విడుదల తేదీపై స్పష్టత రావాల్సి ఉంది.
థమన్ పోస్టుతో బయటకు వచ్చిన తేదీనే చిత్రబృందం ఖరారు చేసిందా? లేదా మార్పులు ఉండే అవకాశం ఉందా? అనేది అధికారిక ప్రకటన తర్వాతే తేలనుంది. త్వరలోనే కొత్త విడుదల తేదీతో అధికారిక పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాగా, వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ‘ఆదర్శ కుటుంబం’పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో పాటు త్రివిక్రమ్ శైలిలో ఉండే వినోదం, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చి ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది. నివేదా పేతురాజ్, నారా రోహిత్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వెంకటేష్‌తో పాటు భారీ తారాగణం ఉండటంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

