Lava Virat Curve 5G | లావా నుంచి కర్వుడ్ డిస్ప్లేతో విరాట్ కర్వ్ 5జీ ఫోన్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే
Lava Virat Curve 5G : దేశీయ బ్రాండ్ లావా నుంచి తాజాగా విరాట్ కర్వ్ పేరుతో 5జీ ఫోన్ విడుదలైంది. మీడియం బడ్జెట్లోనే 3డీ కర్వుడ్ అమోలెడ్ డిస్ప్లేతో వచ్చిన 5జీ ఫోన్ ఇది. సెప్టెంబర్ 28 నుంచి ఫ్లిప్కార్ట్లో సేల్కు అందుబాటులో ఉంటుంది.
Lava Virat Curve 5G : దేశీయ బ్రాండ్ లావా నుంచి తాజాగా విరాట్ కర్వ్ పేరుతో 5జీ ఫోన్ విడుదలైంది. తక్కువ ధరలోనే మంచి ఫీచర్లతో ఆకట్టుకుంటున్న లావా బ్రాండ్.. ఈసారి కూడా మంచి ఫీచర్లతోనే కొత్త ఫోన్ను లాంఛ్ చేసింది. మీడియం బడ్జెట్లోనే 3డీ కర్వుడ్ అమోలెడ్ డిస్ప్లేతో వచ్చిన 5జీ ఫోన్ ఇది.
సెప్టెంబర్ 28 నుంచి ఫ్లిప్కార్ట్లో సేల్కు అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్ఫోన్ అసలు ధర రూ.23,999 అయినప్పటికీ.. ప్రారంభ ఆఫర్, వివిధ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లతో రూ.19,999కే కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఎల్లోరా స్లేట్, హెరిటేజ్ ఇండిగో, మాక్రాన ఐవరీ రంగుల్లో లభిస్తుంది. ఈ ఫోన్లోని కీలక ఫీచర్లివి.
6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ 3డీ కర్వుడ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్జ్ రిఫ్రెష్రేట్, 1100 నిట్స్ పీక్బ్రైట్నెస్, మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 16 ఓఎస్, వెనుకవైపు మినీ డిస్ప్లే, 50 ఎంపీ మెయిన్ కెమెరా, 13 ఎంపీ సెల్ఫీ కెమెరా, ఇన్డిస్ప్లే ఫింగర్ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్లాక్, ఐఆర్ బ్లాస్టర్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 33 వాట్స్ ఛార్జర్ ఇన్ బాక్స్, 6జీబీ+128జీబీ, మిలిటరీ గ్రేడ్ సర్టిఫైడ్, ఐపీ 64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్, ప్రీమియం లెదర్ వెగాన్ ఫినిష్ వంటి ఫీచర్లున్నాయి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

