Global Summit | కరువులో సర్కార్.. ప్రచారానికి 500 కోట్లు.. ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’కు భారీ ప్రచారం
Global Summit | రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నదని ఒకవైపు చెప్తూనే, మరోవైపు కేవలం ప్రచార ఆర్భాటానికి రూ.500 కోట్లు ఖర్చు చేయడం, విదేశాల్లో రోడ్‌షోలు, ప్రచారానికి రూ.350 కోట్లు ఖర్చు చేయడం ఏందన్న విమర్శలు వస్తున్నాయి.
Global Summit | హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): ఒకవైపు ఎల్ నిన్ ప్రభావంతో రాష్ట్ర కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. మరోవైపు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేందుకు ప్రభుత్వం డబ్బులు లేవంటున్నది. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధులు కొరత అంటారు. పెన్షన్లకు కనీసం పెండింగ్ బిల్లులు కూడా ఇవ్వరు. ఉద్యోగులకు సంబంధించిన మెడికల్ బిల్లులు నేటికి ఇంకా చెల్లించలేదు. కానీ, తన ప్రచారానికి మాత్రం రూ.వందల కోట్లను మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేయడం రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికే చెల్లింది.
ఢిల్లీ టూర్లు, విదేశీ టూర్ల పేరుతో సీఎం, మంత్రులు ఇప్పటికే ప్రజాధనాన్ని దుబారా చేస్తుండగా, తాజాగా డిసెంబర్లో హైదరాబాద్‌లో నిర్వహించే ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ ప్రచారానికే మొత్తం రూ.500 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. అసలు ఉన్నయో.. లేవో తెలియని దేశాల్లో కూడా ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు రూ.350 కోట్లు ఖర్చుచేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాల్లో రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలకు ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నారు.
విదేశాల్లో ప్రచారానికి రూ.350 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించగా, మన దేశంలోని వివిధ రాష్ర్టాల్లో ప్రచారాలకు, హైదరాబాద్‌లో ఇన్వెస్ట్ తెలంగాణ సమ్మిట్ జరిగే ప్రాంతంలో, మన రాష్ట్రంలో మీడియా, సోషల్ మీడియాల్లో ప్రచారానికి మరో రూ.150 కోట్లు ఖర్చుచేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలిసింది. ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నది. అంతర్జాతీయ, జాతీయస్థాయి ప్రచార కార్యక్రమాల పర్యవేక్షణ మొత్తం ముఖ్యమంత్రి నేతృత్వంలోని అధికారుల కనుసన్నల్లోనే చేపట్టనున్నారు.
యూరప్, అమెరికాల్లో..
యూరప్‌లోని ఇంగ్లాండ్, ఆస్ట్రియా, బెల్జియం, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ తదితర దేశాలతోపాటు అమెరికాలోని పలు రాష్ర్టాల్లోనూ హైదరాబాద్‌లో డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు కొనసాగే గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారు. రోడ్‌షోలు, ప్రకటనలు, సోషల్ మీడియా ద్వారా ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిసింది. యూరప్, అమెరికాతోపాటు దుబాయ్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కూడా కార్యక్రమాలు చేపడుతామని ఓ అధికారి వెల్లడించారు.
ఈ ప్రచార కార్యక్రమాలన్నీ ముఖ్యమంత్రి మీడియా సలహాదారు డైరెక్షన్లో ఇద్దరు ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల సారథ్యంలో కొనసాగుతాయని చెప్తున్నారు. ఇప్పటికే పలు ఏజన్సీలను పిలిపించి టారిఫ్‌లు మాట్లాడినట్టు తెలిసింది. వారం, పది రోజుల్లో రోడ్‌షోలు మొదలవుతాయని చెప్తున్నారు. మన దేశంలో కూడా ఏ రాష్ట్రంలో ఏంచేయాలన్న దానిపై రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ, సీఎం ముఖ్య పౌరసంబంధాల అధికారులు లెక్కలు వేసినట్టు తెలుస్తున్నది. వీరు రూ.150 కోట్లను ఖర్చు చేస్తారని సమాచారం. ఇప్పటికే వీరు కొన్ని ఏజెన్సీలతో ముందస్తు ఒప్పందాలు కూడా చేసుకున్నట్టు తెలిసింది.
దుబారానే కదా?
ఒక కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లను కేవలం ప్రచారానికే ఖర్చు చేయబోతుండటంపై విమర్శలొస్తున్నాయి. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నదని ఒకవైపు చెప్తూనే, మరోవైపు కేవలం ప్రచార ఆర్భాటానికి రూ.500 కోట్లు ఖర్చు చేయడం, విదేశాల్లో రోడ్‌షోలు, ప్రచారానికి రూ.350 కోట్లు ఖర్చు చేయడం ఏందన్న విమర్శలు వస్తున్నాయి. అయితే, ఇందులో భారీఎత్తున అవినీతి జరిగే అవకాశం కూడా ఉన్నదని, ఒకట్రెండు ఏజెన్సీలకే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Brazil Presidential Election | బ్రెజిల్ ఎన్నికల్లో ఓటమి..యూఎస్‌కు బోల్సొనారో పరార్
Justice Rekha Sharma | కొలీజియంలో ‘బంధుప్రీతి’! విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రేఖా శర్మ తీవ్ర విమర్శలు
Jio IPO | దద్దరిల్లిన జియో లిస్టింగ్.. దేశీయ స్టాక్ మార్కెట్లలోకి గ్రాండ్ ఎంట్రీ
Supreme Court | ఫామ్ 6, 7, 8లను మార్చలేరు.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు స్పష్టీకరణ
Musi Project | మూసీ ముసుగులో లూటీ.. గుట్టుగా ప్రజాభిప్రాయ సేకరణ .. ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

