Francis Halzen: న్యూట్రినోలను బంధించిన ఫ్రాన్సిస్ హాల్జన్‌కు ఫిజిక్స్‌లో నోబెల్
Nobel Prize in Physics: ఫ్రాన్సిస్ హాల్జన్‌కు ఫిజిక్స్‌లో నోబెల్ దక్కింది. ఐస్‌క్యూబ్ నూట్రినో అబ్జర్వేటరీకి సహకారం అందించినందుకు, ఖగోళానికి చెందిన అత్యంత శక్తివంతమైన న్యూట్రినోలను గుర్తించినందుకు ఆయన్ను ఆ అవార్డు వరించింది. ఇవాళ స్టాక్‌హోమ్‌లో రాయల్ స్వీడిష్ అకాడమీ ఆ అవార్డును ప్రకటించింది.
స్టాక్‌హోమ్: భౌతిక శాస్త్రంలో 2026 నోబెల్ బహుమతి ఫ్రాన్సిస్ హాల్జన్(Francis Halzen)కు దక్కింది. ఐస్‌క్యూబ్ నూట్రినో అబ్జర్వేటరీకి సహకారం అందించినందుకు, ఖగోళానికి చెందిన అత్యంత శక్తివంతమైన న్యూట్రినోలను గుర్తించినందుకు ఆయనకు ఈ అవార్డును అందజేయనున్నారు. అమెరికాలోని మాడిసన్లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ విస్కిన్‌సన్‌లో ప్రొఫెసర్‌గా చేస్తున్న ఫ్రాన్సిస్ హాల్జన్.. దక్షిణ ద్రువంలో ఉన్న ఐస్‌క్యూబ్ ఆబ్జర్వేటరీ ద్వారా అంతుచిక్కని న్యూట్రినోలను బంధించి, అధ్యయనం చేయడంలో కీలక పాత్ర పోషించారు. దక్షిణ ద్రువం వద్ద ఉన్న మంచుతో న్యూట్రినోలను ట్రాక్ చేయవచ్చు అని ఫ్రాన్సిస్ గుర్తించారు. అయితే ఐస్‌క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీలో ఫ్రాన్సిస్ విజన్, నాయకత్వం కీలకంగా నిలిచినట్లు నోబెల్ కమిటీ పేర్కొన్నది. సుదూరు విశ్వంలో ఉన్న న్యూట్రినోలను ఐస్‌క్యూబ్ ద్వారా పరిశోధకులు పట్టుకుంటున్నట్లు తెలిసింది. విశ్వరహస్యాలను చేధించడంలో.. న్యూట్రినోలు కీలకం కానున్నట్లు ఖగోళ పరిశోధకులు భావిస్తున్నారు.
BREAKING NEWS
The Royal Swedish Academy of Sciences has decided to award the 2026 #NobelPrize in Physics to Francis Halzen “for decisive contributions to the IceCube Neutrino Observatory and the discovery of high-energy neutrinos of astrophysical origin.” https://t.co/UcPBWk0RiK— The Nobel Prize (@NobelPrize) October 6, 2026
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CPI | తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించండి.. సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి కూనంనేని
KTR | కేటీఆర్‌పై తప్పుడు ఆరోపణలు చేయొద్దు.. బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్‌కు కోర్టు ఆదేశాలు
All Party Meeting | పాలనకు హాలిడే.. ఒకవైపు క్రాప్ హాలిడే.. మరోవైపు పవర్ హాలిడే.. ఉత్త చేతులతో అఖిలపక్షానికి మంత్రులు
Harish rao | మీటింగ్ ఎజెండా నిజమా? మీరు చెప్పింది నిజమా? : హరీశ్‌రావు
Narsingi | కొంపలు కూల్చే బిగ్రోడ్.. నార్సింగిలో రాయలసీమ రియల్టర్‌తో కలిసి బిగ్ బ్రదర్ హల్చల్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

