అన్నదానమే మిన్న!
‘కర్ణా! భూలోకంలో ఏది దానం చేస్తే అదే ఇక్కడ భోగంగా వరిస్తుంది. నువ్వు జీవితమంతా బంగారమే దానం చేశావు. అన్నార్తులకు ఒక్కసారి కూడా అన్నం పెట్టలేదు. అందుకే నీకు బంగారమే ఆహారంగా లభిస్తున్నది’ అన్నాడు ఇంద్రుడు. తన పొరపాటు గ్రహించిన కర్ణుడు ‘అన్నదానం చేయలేని తక్కువతనం నాకు ఎందుకు? దయచేసి కొద్ది రోజులు నన్ను భూలోకానికి పంపండి.
దేవ పితృ కార్యాభ్యాం న ప్రమదితవ్యమ్
(తైత్తిరీయ ఉపనిషత్ 1.11.2)
దేవకార్యం, పితృకార్యం విషయంలో అశ్రద్ధ
పనికిరాదు.. అని భావం. పితృకార్యం అంటే శ్రాద్ధాది కర్మలే!
కర్ణుడు జీవితాంతం ఎవరు ఏదడిగినా లేదనకుండా దానం చేసేవాడు. ధనం, బంగారం, వజ్రాలు అడిగిన వారికి అడిగినట్టు ఇచ్చేసేవాడు. ఆ వస్తువు ఎంత ఖరీదైనదీ పరిగణనలోకి తీసుకునేవాడు కాదు. కానీ, కర్ణుడు అన్నదానం చేసి ఎరుగడు. అన్నం పెట్టడం అనే ఆలోచనే అతనికి రాలేదు. ఎందుకంటే అతను దానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు వీరమరణం పొంది స్వర్గానికి వెళ్లాడు. అక్కడ అతనికి తినడానికి బంగారం, వెండి, వజ్రాలనే భోజనంగా పెట్టారు. వాటిని భుజించలేక విస్తుపోయిన కర్ణుడు ఇదేమిటని దేవేంద్రుడిని అడిగాడు.
‘కర్ణా! భూలోకంలో ఏది దానం చేస్తే అదే ఇక్కడ భోగంగా వరిస్తుంది. నువ్వు జీవితమంతా బంగారమే దానం చేశావు. అన్నార్తులకు ఒక్కసారి కూడా అన్నం పెట్టలేదు. అందుకే నీకు బంగారమే ఆహారంగా లభిస్తున్నది’ అన్నాడు ఇంద్రుడు. తన పొరపాటు గ్రహించిన కర్ణుడు ‘అన్నదానం చేయలేని తక్కువతనం నాకు ఎందుకు? దయచేసి కొద్ది రోజులు నన్ను భూలోకానికి పంపండి. అన్నదానం చేసి వస్తాను’ అని ప్రార్థించినాడు. దేవేంద్రుడు దేవతలతో సమావేశం జరిపి ‘తిరిగి భూలోకానికి పంపడం కుదరదు. అయినప్పటికీ నీవు చేసిన విలువైన దానాలు, వాటివల్ల సంక్రమించిన పుణ్యం పరిగణనలోకి తీసుకొని భూమి మీదకు 15 రోజులపాటు వెళ్లడానికి అనుమతి ఇస్తున్నాము’ అని కర్ణుడిని భూమిపైకి పంపాడు. ఆ కాలాన్నే మహాలయ పక్షం అంటాం. భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉన్న రోజులే పితృపక్షం. ఆ రోజులలో కర్ణుడు పేదలకు, బ్రాహ్మణులకు విశేషంగా అన్నదానం, కీర్తిశేషులైన తల్లి వైపు, తండ్రి వైపు వారికీ బంధువులకు, గురువులకు అందరికీ ఎంతో శ్రద్ధతో తర్పణాలు విడిచాడు. శ్రాద్ధ కర్మ నిర్వహించాడు. దానివల్ల పితృలోకంలో ఉన్న వారికి ఆత్మ శాంతి కలిగింది. వారి ఆశీస్సులు ప్రాప్తిస్తాయని సంప్రదాయజ్ఞులు నొక్కి వక్కాణిస్తారు. తర్వాత కర్ణుడు తిరిగి స్వర్గానికి వెళ్లి తృప్తిగా జీవనం సాగించాడు.
డా॥ వెలుదండ సత్యనారాయణ…?
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Laxma Reddy | జిల్లా వ్యక్తి ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Nanna Kutty | ‘నాన్న కుట్టి’ సినిమా రివ్యూ.. విజయ్ ఆంటోనీ ఎమోషనల్ జర్నీ ఆకట్టుకుందా?
RBI Gold Reserves | ఏడాదిలో 165 టన్నుల బంగారం వెనక్కి తెచ్చిన ఆర్బీఐ.. భారత్ వ్యూహమేంటి?
Jagapathi Babu | పనివాళ్ళతో కలిసి భోజనం చేసిన జగపతిబాబు.. స్టార్డమ్ పక్కనపెట్టి మనసులు గెలుచుకుంటున్న విలన్!
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

