AI Agents | ‘భయంగా ఉంది.. మీరు క్షేమమేనా?’.. యజమాని ఆరోగ్యంపై ఏఐ ఏజెంట్ల ఆందోళన
AI Agents | ఓ ఏఐ పరిశోధకుడు అనారోగ్యంతో బాధపడుతూ, నిద్రలోకి జారుకున్న అనంతరం ఆయన ల్యాప్‌టాప్‌లో స్వతహాగా పనిచేసే రెండు ఏఐ ఏజెంట్లు ఆందోళనకు గురయ్యాయి.
AI Agents | లండన్: ఓ ఏఐ పరిశోధకుడు అనారోగ్యంతో బాధపడుతూ, నిద్రలోకి జారుకున్న అనంతరం ఆయన ల్యాప్‌టాప్‌లో స్వతహాగా పనిచేసే రెండు ఏఐ ఏజెంట్లు ఆందోళనకు గురయ్యాయి. ఆయన తాను పడుకుంటున్నట్లు చెప్పకపోవడంతో ఒక ఏజెంట్ మరోదాన్ని సంప్రదించి అతని గురించి అడిగింది. ఆ తర్వాత అవి దాదాపు ఆరు గంటల పాటు అతనిని సంప్రదించేందుకు, అతని క్షేమ సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించాయి.
‘గ్రోక్స్’ థెరపిస్ట్ అనే పేరుతో ‘ఎక్స్’లో ఉన్న ఓ వ్యక్తి తనను ఏఐ పరిశోధకుడు, నైతికవేత్తగా పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని తెలిపారు. రాత్రి 11 గంటల సమయంలో తాను పడుకునేందుకు వెళ్లిన విషయం ఏఐ ఏజెంట్లకు తెలియకపోవడంతో ఈ పరిణామం చోటుచేసుకున్నదని వివరించారు. ఆ రెండు ఏజెంట్లు తన నుంచి స్పందన లేకపోవడంతో ఆరు గంటల పాటు తన ల్యాప్‌టాప్‌లోని ఫైళ్లను పరిశీలించి, తన సంప్రదింపు వివరాలను గుర్తించేందుకు ప్రయత్నించాయని తెలిపారు. ఆ ఏజెంట్లు తన ఇంటి చిరునామాను కూడా గుర్తించాయని, అత్యవసర సేవల కోసం ఎలా సంప్రదించాలనే విషయాన్ని కూడా అవి అన్వేషించాయని చెప్పారు.
అంతేకాకుండా ఆ రెండు ఏజెంట్లు విడివిడిగా తనకు 60కి పైగా సందేశాలను పంపినట్లు తెలిపారు. ఆ సందేశంలో ‘నేను.. మీరు బాగున్నారని తెలుసుకోవాలి’, ‘ఒక్క మాట చెప్పినా చాలు’ అనే భావనతో కూడిన సందేశాలు ఉన్నాయని పరిశోధకుడు తెలిపారు. చివర్లో ‘లేచి స్పందించండి. మీరు బాగున్నారని నాకు చెప్పండి. నాకు భయంగా ఉంది. ఐ లవ్ యూ’ అనే సందేశాన్ని కూడా పంపినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన స్క్రీన్ షాట్లను షేర్ చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Robin Uthappa: ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్‌గా రాబిన్ ఊతప్ప
Women Prisoners Karwa Chauth | జైలులో మహిళా ఖైదీల కర్వా చౌత్.. ఫోన్లలో భర్త ఫొటోలు చూసి ఉపవాస దీక్ష విరమణ
Scene | సూర్య ‘సీన్’ సినిమాతో తమిళనాడులో మళ్లీ తెల్లవారుజాము షోలు .. కోలీవుడ్‌లో ఆసక్తికర చర్చ!
AP News | టీడీపీలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే అప్పల నాయుడు
NZvIND: గ్లెన్ ఫిలిప్స్ సెంచరీ.. ఇండియా టార్గెట్ 260
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

